AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Etela Rajender: నేడు హుజురాబాద్‌ నియోజకవర్గంలో పర్యటించనున్న ఈటల రాజేందర్‌.. ఘన స్వాగతం పలకనున్న నేతలు

Etela Rajender: ఈటల రాజీనామా తర్వాత హుజూరాబాద్ లో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ఇటీవల ఈటల బీజేపీలోకి చేరడంతో నియోజకవర్గమంతా.. టీఆర్ఎస్ వర్సెస్..

Etela Rajender: నేడు హుజురాబాద్‌ నియోజకవర్గంలో పర్యటించనున్న ఈటల రాజేందర్‌.. ఘన స్వాగతం పలకనున్న నేతలు
Eatala Rajender
Subhash Goud
|

Updated on: Jun 17, 2021 | 6:59 AM

Share

Etela Rajender: ఈటల రాజీనామా తర్వాత హుజూరాబాద్ లో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ఇటీవల ఈటల బీజేపీలోకి చేరడంతో నియోజకవర్గమంతా.. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా పోటీ మొదలైంది. రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి. సత్తా చాటుకోవాలనే తపనలో ఈటల నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించనున్నారు. ఈ మేరకు గురువారం ఉదయం 8 గంటలకే ఈటల రాజేందర్‌ హుజూరాబాద్ కు చేరుకోనున్నారు. అయితే బీజేపీలో చేరిన తర్వాత మొదటిసారిగా గురువారం హుజురాబాద్‌ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. హుజురాబాద్‌ పట్టణంలోని పరకాల క్రాస్‌ రోడ్డు వద్ద ఈటల రాజేందర్‌కు భారీ ఘనస్వాగతం పలకనున్నారు బీజేపీ నేతలు, కార్యకర్తలు. అలాగే ఉదయం 11 గంటలకు జమ్మికుంట మండలంలోని నాగారం గ్రామంలో భక్తాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

మరోవైపు హుజూరాబాద్‌లోని మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్‌లు బిజీగా మారిపోయారు. ఇప్పటికే కొన్ని రోజుల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నాయకులు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.

ఇవీ కూడా చదవండి:

Joker Software: భయపెడుతున్న జోకర్‌ సాఫ్ట్‌వేర్‌.. దీనిని ఓపెన్‌ చేస్తే అంతే సంగతి.. సీపీ అంజనీకుమార్‌ హెచ్చరిక

Rythu Bandhu: తెలంగాణ‌లో రైతుబంధు స్కీమ్ కింద రెండు రోజుల్లో రూ.1.669.12 కోట్లు రైతుల ఖాతాల్లో జ‌మ