AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol Diesel Price: మ‌ళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు.. దేశ వ్యాప్తంగా ఇంధ‌న ధ‌ర‌లు ఇలా..

Petrol Diesel Price: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు అన్ని జిల్లాల్లో పెట్రోల్ సెంచరీ కొట్టి ముందుకు వెళ్తోంది. గత కొద్ది రోజులుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.  అయితే..

Petrol Diesel Price: మ‌ళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు.. దేశ వ్యాప్తంగా ఇంధ‌న ధ‌ర‌లు ఇలా..
Petrol Diesel Price
Sanjay Kasula
|

Updated on: Jun 17, 2021 | 6:55 AM

Share

Petrol-Diesel Rates Today:  రోజు రోజు పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. వాహనం నడపాలంటేనే వణికిపోతున్నారు. సెంచరీ దాటిన పెట్రోల్ ధరను చూసి పొదుపుగా వాహన ప్రయాణాలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు అన్ని జిల్లాల్లో పెట్రోల్ సెంచరీ కొట్టి ముందుకు వెళ్తోంది. గత కొద్ది రోజులుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.  అయితే అధికారిక సమాచారం ప్రకారం.. గురువారం నాడు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.46 గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 95.28గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.74 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.95.54గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 101.03గా ఉండగా.. డీజిల్ ధర రూ. 95.79గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.75గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.55గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.46ఉండగా.. డీజిల్ ధర రూ.95.60 గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.23 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 95.05గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 102.98 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్  ధర రూ. 96.47 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ. 102.27 ఉండగా.. డీజిల్ ధర రూ.96.47గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.16లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.96.38 గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.94 గా ఉండగా.. డీజిల్ ధర రూ.97.15గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 102.98 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.97.19 లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 96.66గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 87.41 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.82కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.84 గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.96.58 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 90.25 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 97.91ఉండగా.. డీజిల్ ధర రూ.92.04గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.99.89 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.92.66 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 93.88 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.87.81గా ఉంది.

ఇవి కూడా చదవండి:  Delhi AIIMS: ఢిల్లీ ఎయిమ్స్‌లో అగ్ని ప్ర‌మాదం.. సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న 22 ఫైర్ ఇంజ‌న్లు..

Follow Us