AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Huzurabad Election Results: వెల్లడైన హుజూరాబాద్ ఫలితాలు.. కీలక ప్రకటన చేసిన మంత్రి హరీష్ రావు..

Huzurabad Election Results: హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర మంత్రి హరీష్ రావు స్పందించారు. హుజూరాబాద్ ఎన్నికల ఫలితాల్లో ప్రజా తీర్పును శిరసావహిస్తామని ప్రకటించారు.

Huzurabad Election Results: వెల్లడైన హుజూరాబాద్ ఫలితాలు.. కీలక ప్రకటన చేసిన మంత్రి హరీష్ రావు..
Harish Rao
Shiva Prajapati
|

Updated on: Nov 02, 2021 | 8:03 PM

Share

Huzurabad Election Results: హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర మంత్రి హరీష్ రావు స్పందించారు. హుజూరాబాద్ ఎన్నికల ఫలితాల్లో ప్రజా తీర్పును శిరసావహిస్తామని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసిన ఓటర్లందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు, నేతలు అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో బీజేపీ, కాంగ్రెస్ రసహ్య ఒప్పందంపై మంత్రి హరీష్ రావు సంచలన కామెంట్స్ చేశారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా హుజూరాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీ లు కలిసి పనిచేశాయని అన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా చెబుతున్నారని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో కొట్లాడే బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు.. రాష్ట్ర స్థాయిలో కుమ్మక్కు కావడాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తు్న్నారు. ‘‘ఏది ఏమైనా టీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎన్నికలో ఓటమితో కుంగిపోదు.. గెలిచిన నాడు పొంగిపోలేదు.. ఒడినా.. గెలిచినా.. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన ఉండి పని చేస్తుంది.’’ అని వ్యాఖ్యానించారు మంత్రి హరీష్ రావు.

Also read:

Diwali 2021: లోకకంఠకుడిగా మారితే.. కొడుకైనా సరే వధించక తప్పదని తెలిపే కథ.. నరకాసుర వధ

Viral: డేటింగ్‌ తర్వాత ప్రపోజ్ చేయని ప్రియుడు.. కోపంతో ప్రేయసి ఏం చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్.!

Blatant Cheating: గాల్లోకి బంతి లేపింది.. పట్టుకోకుండా అడ్డుకుంది.. చివరికి ఏమైందంటే..