Huzurabad By poll: హుజూరాబాద్ బైపోల్‌కు కౌంట్‌డౌన్ షురూ.. ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్ఎస్-బీజేపీ.. కన్ఫ్యూజన్‌లో కాంగ్రెస్!

హుజూరాబాద్ బైపోల్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. అధికార పార్టీ టీఆర్ఎస్ - బీజేపీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. మరి కాంగ్రెస్ ఇప్పటికీ కనీసం అభ్యర్థిని కూడా ఎందుకు ప్రకటించలేకపోతోంది.

Huzurabad By poll: హుజూరాబాద్ బైపోల్‌కు కౌంట్‌డౌన్ షురూ.. ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్ఎస్-బీజేపీ.. కన్ఫ్యూజన్‌లో కాంగ్రెస్!
Huzurabad Congress Candidate Selection
Balaraju Goud

|

Sep 30, 2021 | 8:22 PM

Huzurabad Congress Candidate: హుజూరాబాద్ బైపోల్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. అధికార పార్టీ టీఆర్ఎస్ – బీజేపీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. మరి కాంగ్రెస్ పరిస్థితి మాత్రం అగమ్యగోచంరగా మారింది. ఇప్పటికీ కనీసం అభ్యర్థిని కూడా ఎందుకు ప్రకటించలేకపోతోంది. హుజూరాబాద్ ప్రీమియర్ లీగ్ తెలంగాణ పాలిటిక్స్‌ను హీటెక్కిస్తోంది. మిగతా పార్టీలన్నీ ఓట్ల వేటలో మునిగిపోయాయి. కానీ కాంగ్రెస్‌కు మాత్రం ఇంకా క్లారిటీ లేదు.. క్యాండిడేట్‌పై స్పష్టత లేదు. స్థానికులకే టిక్కెట్ ఇవ్వాలన్న డిమాండ్ పెరుగుతోంది.

గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన కౌశిక్ రెడ్డి.. అధికార TRS పార్టీలో చేరిపోయారు. దీంతో గత 3 నెలలుగా.. అభ్యర్థి కోసం అన్వేషణ మొదలుపెట్టింది కాంగ్రెస్. మొదట.. కొండా సురేఖ పేరు తెర పైకి వచ్చింది. ఆమె హుజూరాబాద్ ఉప పోరు పట్ల పెద్దగా ఆసక్తి చూపలేదు. తర్వాత కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు.. మరో నేత క్రిష్ణారెడ్డి పేర్లు పరిశీలించారు. ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి దామోదర్ రెడ్డి సతీమణి మాలతి రెడ్డి పేరు వినిపిస్తోంది. కానీ ఆమె కుమారుడు కశ్యప రెడ్డి ఇప్పటికే TRSలో ఉన్నారు. అయితే, ఆమె పోటీ చేయడంపై క్లారిటీ లేదు. ఒకవేళ బరిలోకి దిగితే రెడ్డి సామాజిక వర్గ ఓట్లతోపాటు.. దామోదర్‌రెడ్డి పై ఉన్న సానుభూతి కూడా వర్కౌట్ అవుతుందన్నది కాంగ్రెస్ పెద్దల ప్లాన్. కానీ ఇది కూడా ఫైనల్ కాలేదు. మరోవైపు ఎంపికపై రాష్ట్ర నాయకత్వం మల్లగుల్లాలు పడుతోంది.

హుజూరాబాద్ బైపోల్‌కు సరిగ్గా నెల రోజుల గడువే మిగిలి ఉంది. మరి అభ్యర్థిని ఎప్పుడు ఖరారు చేస్తారు? ఎప్పుడు ప్రచారం చేస్తారు. ఇంత తక్కువ సమయంలో.. గ్రామగ్రామన ప్రచారం సాధ్యమయ్యే పనేనా? అందుకే క్యాడర్ కూడా కన్ఫ్యూజన్‌లో ఉంది. ఇప్పుడీ ఎపిసోడ్‌ అంతా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి క‌త్తిమీద సాములా మారింది. తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న మొదటి బైపోల్ ఇది కావడం విశేషం. అయితే, పార్టీ తరపున ఎవ‌రిని బ‌రిలో దింపాలన్నది ఇంతవరకు అంతు చిక్కడం లేదు.

మొద‌ట్లో పార్టీ ఎలక్షన్‌ మేనేజ్‌మెంట్ కమటీ ఛైర్మన్ దామోద‌ర రాజ‌న‌ర్సింహ నేతృత్వంలో క‌మిటీ వేశారు. ఆ క‌మిటీ సూచించిన పేర్ల విష‌యంలో జిల్లాకు చెందిన సీనియ‌ర్లు పెద‌వి విరిచారు. దీంతో మ‌రోసారి భ‌ట్టి విక్రమార్క, దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌తో క‌లిపి మ‌రో క‌మిటీ వేశారు. ఈ క‌మిటీ సెప్టెంబ‌ర్ 10లోపు నివేదిక ఇవ్వాల్సి ఉండ‌గా.. గ‌డువులోగా ఇవ్వలేదు. తీరా షెడ్యూల్ రావ‌డంతో ఆఘమేఘాలపై న‌లుగురి పేర్లను సూచిస్తూ ఓ రిపోర్ట్ ఇచ్చింది. దీంతో క్యాండిడేట్ ఎంపిక భారం మొత్తం రేవంత్‌ రెడ్డిపైనే పడింది..ఇప్పుడీ లిస్ట్‌ను హైకమాండ్‌కు పంపి అనుమతి తీసుకోవాలి. ఇదంతా ఎప్పుడు పూర్తవుతుందో తెలియక కాంగ్రెస్ శ్రేణులు కన్ఫ్యూజన్‌లో మునిగిపోయాయి.

Read Also…  AP News CS Sameer Sharma: ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన సమీర్‌ శర్మ.. చిత్రాలు

Mukesh Ambani-Gautam Adani: మళ్ళీ అంబానీని దాటిన అదాని.. ఆసియాలో రెండో అత్యంత ధనవంతుడు..ఆయన ఆస్తుల విలువ ఎంతంటే..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu