Huzurabad By Election: హూజురాబాద్‌ నేతలకు బంపర్ ఆఫర్.. ఉప ఎన్నికల్లో మద్దతు ఇస్తే కారు గిఫ్ట్ !?

హుజురాబాద్‌లో జోరుగా కార్ రేస్ న‌డుస్తుంది. ఇదేదో కుర్రకారు రోడ్లపై చేస్తున్న రేసింగ్ కాదు. త‌ల‌పండిన రాజ‌కీయ‌నేతలు అడుతున్న పొలిటిక‌ల్ రేస్‌. ఒక‌రు మారుతి బ్రెజా అంటే ఇంకొక‌రు క్రెటా కారిస్తామంటున్నారు.

Huzurabad By Election: హూజురాబాద్‌ నేతలకు బంపర్ ఆఫర్.. ఉప ఎన్నికల్లో మద్దతు ఇస్తే కారు గిఫ్ట్ !?
Huzurabad By Elections
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 01, 2021 | 6:38 PM

Huzurabad By Election: హుజురాబాద్‌లో జోరుగా కార్ రేస్ న‌డుస్తుంది. ఇదేదో కుర్రకారు రోడ్లపై చేస్తున్న రేసింగ్ కాదు. త‌ల‌పండిన రాజ‌కీయ‌నేతలు అడుతున్న పొలిటిక‌ల్ రేస్‌. ఒక‌రు మారుతి బ్రెజా అంటే ఇంకొక‌రు క్రెటా కారిస్తామంటున్నారు. ఇవ‌న్నీ ఎందుకు ఇన్నోవా ఇస్తా ఇంకేం మాట్లాడ‌కంటుంది మరో పార్టీ. ఇంతకీ హుజురాబాద్‌లో ఎం జ‌రుగుతుంది. కార్లతో ఈ బేరాలేంటీ..?

మాజీ మంత్రి ఈటల రాజేందర్ బర్తరఫ్‌ అనంతరం ఎమ్మెల్యే పదవికి రాజీనామాతో హుజురాబాద్ హీటెక్కిపోయింది. గ‌త రెండు దశాబ్దాలుగా ఇక్కడ ఏకచట్రధిత్యంగా సాగిన ఎన్నికలు.. ఈసారి ఉప ఎన్నిక కొత్త టెన్షన్ క్రియేట్ చేస్తోంది. మూడు సార్లు ఉపఎన్నిక‌ జ‌రిగినా వార్ వ‌న్‌సైడ్ అన్నట్లుగానే ఉండేది. గులాబి జెండా వ‌రుస‌గా గెలుచుకుంటూ వ‌చ్చింది. కానీ, ఇప్పుడు సీన్ మారింది. ఎ గులాబిజెండా ఘ‌న‌విజ‌యాలు సాధించారో అదే జెండాతో హోరాహోరి పోరుకు సిద్ధమ‌వుతున్నారు ఈటల‌ రాజేందర్. వ్యక్తిగ‌త పోరు అయ‌న బీజేపీలో చేర‌డంతో రెండు పార్టీల రాజ‌కీయ పోరుగా మారింది.

ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడనేలేదు.. అయినప్పటికీ, హుజూరాబాద్‌లో ఎన్నిక‌ల హడావిడి మాత్రం షురూ అయ్యింది. ఇంకా చాలా స‌మ‌యం ఉన్నా.. ఇప్పటినుంచే ప్రచారంలో దూకుడు క‌నిపిస్తుంది. టీఅర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన ఈటల వెంట టీఅర్ఎస్ క్యాడ‌ర్ వెళ్లకుండా గ‌ట్టి ప్రయ‌త్నమే చేసి అడ్డుకోగలిగింది అధికార‌పార్టీ. బ‌లం పెంచుకునేందుకు బీజేపీ కూడా అదే స్థాయిలో ప్రయ‌త్నాలు చేస్తుంది. కాంగ్రెస్ కూడా కొంత ప్రభావం చూపేంద‌కు ప్రయ‌త్నిస్తోంది.

ఇప్పుడు ఇక్కడ అసలు కార్ రేసింగ్ మెద‌లైంది. హూజురాబాద్ నియెజ‌క‌వ‌ర్గం మెద‌టి నుంచి కొంత అభివృధ్ది చెందిన ప్రాంతం. మానేరు డ్యాం కింద ఉండ‌డంతో పంట‌లు బాగా పండే నియోజ‌క‌వ‌ర్గం. దీంతో అక్కడ నేత‌ల‌కు కార్లతో వ‌ల వేస్తున్నాయి రాజ‌కీయ పార్టీలు. మండల, గ్రామ స్థాయి నేతలను ఆకట్టుకునేందుకే ప్రధాన పార్టీలు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తమ అభ్యర్థికి మద్దతు ఇస్తే పలానా కారు గిఫ్టుగా ఇస్తామని ఆశజూపుతున్నారు.

నియోజ‌క‌వ‌ర్గంలోని వీన‌వంక మండ‌లంలోని ఓ మేజ‌ర్ గ్రామ‌పంచాయితి నేత‌కు ఓ జాతీయ పార్టీ త‌మ పార్టీలో చేరితే మారుతి బ్రేజా కారు కొనిస్తామ‌ని అఫ‌ర్ ఇచ్చింది. అ కాంగ్రెస్ నేత అలోచిస్తుండ‌గానే ఇంకో పార్టీ.. ఒకడుగు ముందుకేసి.. తాము క్రెటా కారు కొనిస్తామంటూ బంప‌ర్ అఫ‌ర్ ఇచ్చింది. ఇది అక్కడే కాదు దాదాపుగా నియోజ‌క‌వ‌ర్గం మెత్తం కార్ల బేర‌సారాలు సాగుతునే ఉన్నాయి. మాములుగా రెండు మూడు వేల ఓట్లను ప్రభావితం చేసే స్థాయి నేత‌ల నుంచి మండ‌ల‌స్థాయి నేత‌ల వ‌ర‌కు వారి స్థాయికి త‌గ్గ కార్లతో వ‌ల వేసే ప్రయ‌త్నం జ‌రుగుతుంది. చిన్న స్థాయి నేత‌ల‌కు కూడా ఎన్నిక‌ల ఖ‌ర్చు కోస‌మంటు ఐదు నుంచి ప‌దిల‌క్షలు ఇవ్వడం కామ‌న్‌గా మారిపోయింది. అదే కార్ల రూపంలో కానుక‌లు ఇస్తే అంతే ఖ‌ర్చుతో మ‌రింత మంది నేత‌ల‌ను అక‌ర్షించ‌వ‌చ్చున‌ని అన్నిపార్టీల అప్‌డేటెడ్ అలోచ‌న‌గా మారింది. సాధార‌ణంగా కారుపై ఉండే మోజు, అక‌ర్షన‌ను ఇక్కడ వ‌ల‌గా మార్చుకుంటున్నాయి రాజ‌కీయ‌పార్టీలు.

మరోవైపు, కుల‌సంఘాల నేత‌ల‌కు కూడా కార్లతో గాలం వేస్తున్నాయి పార్టీలు. ఇప్పటికైతే హ‌మీలు ఇస్తున్న నేత‌లు హుజురాబాద్ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రాగానే డెలివ‌రి ఇస్తామ‌ని చెబుతున్నాయి. క‌రీంన‌గ‌ర్, వ‌రంగ‌ల్‌, హైద‌రాబాద్‌లోని కార్ల షోరుముల్లో బ‌ల్క్ అర్డర్స్ కోసం కొంత డ‌బ్బును ముందుగానే చెల్లించిన‌ట్లు స‌మాచారం. నేరుగా అయా నేత‌ల‌పైనే కార్లు కొనుగోలు చేసేందుకు వారితోనే డ‌బ్బు చెల్లింప‌జేసే విధంగా ఎర్పాట్లు కూడా చేసుకుంటున్నాయి. ఈ విషయం క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ఇప్పుడు హ‌ట్ టాపిక్‌గా మారింది. ఎంతైనా హూజురాబాద్ నేత‌లు ల‌క్కిఫెల్లోస్ అనుకుంటున్నారట జిల్లా నేతలు.

– రాకేష్, టీవీ9 రిపోర్టర్, హైదరాబాద్.