Huzurabad: నేడు హుజురాబాద్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్, వ్యూహాలు అమలు చేయబోతున్న పార్టీలు.. ఇదీ యాక్షన్ ప్లాన్.!

యావత్ తెలంగాణ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోన్న హుజురాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఈ రోజు విడుదల కానుంది. ఇప్పటికే కోడ్ అమల్లోకి వచ్చింది.

Huzurabad: నేడు హుజురాబాద్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్, వ్యూహాలు అమలు చేయబోతున్న పార్టీలు.. ఇదీ యాక్షన్ ప్లాన్.!
Huzurabad
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 01, 2021 | 9:34 AM

Huzurabad By Election Notification: యావత్ తెలంగాణ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోన్న హుజురాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఈ రోజు విడుదల కానుంది. ఇప్పటికే కోడ్ అమల్లోకి వచ్చింది. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ప్రచార పర్వంలో దూకుడుగా వెళుతుండగా కాంగ్రెస్‌లో మాత్రం ఇంకా సబ్దత వీడలేదు. శుక్రవారం నుంచి నామినేషన్ల పర్వం మెదలుకానుంది. ఈటెల రాజేందర్ రాజీనామా తర్వాత ఐదు నెలలుగా హుజురాబాద్ లో రాజకీయం వేడెక్కుతునే ఉంది. ఇటు బీజేపీ.. అటు టీఆర్ఎస్ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ రెండు పార్టీలు దృష్టినంతా హుజురాబాద్ పైనే పెట్టాయి.

అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించగా బీజేపీ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న ఈటెల రాజేందర్ పేరు ఆపార్టీ అఫీషియల్ గా ప్రకటించాల్సి ఉంది. అయితే ఐదు నెలల అవకాశాన్ని అంది పుచ్చుకుని అభ్యర్థి ఖరారు చేయడంలో కాంగ్రెస్ మాత్రం మల్లగుల్లాలు పడుతుంది. అభ్యర్థి ఎంపిక కోసం దరఖాస్తులను ఆహ్వానించి ఎంపికపై ఇంకా కసరత్తు సాగిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ తరపున కొండా సురేఖ, కవ్వంపల్లి సత్యనారాయణ, పత్తి కృష్ణా రెడ్డి మరో ఇద్దరు ముగ్గురు పేర్లు వినబడుతున్నాయి.

వీటితో పాటు టీడీపీ, వామపక్ష పార్టీలు, వైయస్ఆర్ టీపీ మిగతా పార్టీలు సైతం బరిలో నిలవనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు హుజురాబాద్ బరిలో పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ఫీల్డ్ అసిస్టెంట్ లు సైతం పోటీ చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇంకోవైపు ఐదు నెలలుగా ప్రచార హోరుతో దద్దరిల్లిన హుజురాబాద్ లో స్వేచ్చగా తిరగాడిన రాజకీయ పక్షాలపై ఎన్నికల కమిషన్ మూడో కన్నో తెరవనున్నది. ఈ నేపథ్యంలో ఆయా రాజకీయ పక్షాలు ప్రలోభాలకు దూరంగా నిబంధనలకు దగ్గరగా తమ ప్రచారాలను కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొన్నది.

అయితే ఈసారి భారీ బహిరంగ సభలకు ఆస్కారం లేకుండా పోయే అవకాశం ఉంది. శుక్రవారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 8 వ తేదీ వరకు నామినేషన్లకు గడువు ఉంది. నామినేషన్ వేసేందుకు వెళ్లే అభ్యర్థులు సరైన పత్రాలతో రావాలని అభ్యర్థి తప్పనిసరిగా రెండు వ్యాక్సిన్ లు వేయించుకోవలనే నిబంధన ఉంది. ఇప్పటికే నామినేషన్లు స్వీకరించే.. హుజురాబాద్ ఆర్ డి ఓ ఆఫీసులో అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి అభ్యర్థి.. నిబంధనలు పాటించాలని అధికారులు అంటున్నారు.

Read also:  Huzurabad: హుజురాబాద్ అభ్యర్థికి బీ ఫారంతోపాటు, ఎన్నికల ఖర్చుకు టీఆర్ఎస్ పార్టీ ఎంతిచ్చిందో తెలుసా..?