సీక్రెట్‌గా సెకండ్ సెటప్! భార్య సడన్ ఎంట్రీ ఇవ్వడంతో..
భర్త రెండో సంబంధం పెట్టుకుని భార్యను మోసం చేశాడు. భార్య అనుమానంతో భర్తపై నిఘా పెట్టి, అతని అక్రమ సంబంధాన్ని బయటపెట్టింది. ఈ సంఘటనలో భర్త తప్పించుకుంటే, ప్రేయసిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి సంఘటనలు కుటుంబాలకు ఎంతో నష్టం కలిగిస్తున్నాయి.

ఇటీవల కాలంలో జరుగున్న క్రైమ్స్‌ని గమనిస్తే చాలా వరకు వివాహేతర సంబంధాల కారణంగానే చోటు చేసుకుంటున్నాయి. పరాయి వాళ్ల మోజులో పడి కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకుంటుకున్నారు కొంతమంది. తాజాగా హయత్‌నగర్ లక్ష్మారెడ్డి పాలెంలో ఓ వ్యక్తి భార్యకు తెలియకుండా ఏకంగా సెకండ్ సెటప్ పెట్టాడు. ఆమె మోజులో పడి సొంతింటికి కూడా సరిగ్గా వెళ్లడం లేదు. భార్యా పిల్లల్ని కూడా పట్టించుకోవడం లేదు. అతని వ్యవహారం పసిగట్టిన భార్య.. భర్తపై నిఘా పెట్టింది. మరో మహిళతో ఉంటున్నాడని తెలిసి.. అక్కడికి వెళ్లింది. అయితే భార్య రావడంతో.. అక్కడి నుంచి గోడ దూకి జంప్ అయ్యాడు ఆ వ్యక్తి. ఆ విజుల్స్ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటన హయత్‌నగర్ లక్ష్మారెడ్డి పాలెంలో వెలుగుచూసింది.
ప్రశాంత్, శ్వేత దంపతులకు పన్నెండేళ్ల క్రితం పెళ్లైయింది. ఇద్దరు పిల్లలతో హైదరాబాద్ ఎల్బీనగర్‌లో ఉంటున్నారు. శ్వేత తండ్రి చనిపోవటంతో ఆయన జాబ్ కుమార్తెకు కారుణ్య నియామకం ద్వారా వచ్చింది. అయితే గత 3 ఏళ్లుగా భర్త ప్రవర్తనలో మార్పులు గమనించింది శ్వేత. సరిగ్గా ఇంటికి రావడం లేదు, ఏంటని అడిగితే బిజినెస్ అని ఏవేవో కబుర్లు చెబుతున్నాడు. శాలరీతో పాటు.. దాదాపు రూ.30 లక్షల డబ్బు, కారు, స్కూటీ, బంగారం ఖతం చేశాడు.
అసలు డబ్బు అంతా ఏం చేస్తున్నాడని శ్వేత భర్త ఫోన్ చెక్ చేసింది. అందులో అయ్యగారి యవ్వారం బయటపడింది. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని భావించి.. భర్తపై నిఘా పెట్టింది. మంగళవారం రాత్రి భర్తను అనుసరించింది. హయత్ నగర్ శివారు లక్ష్మారెడ్డి పాలెంలో ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్‌తో నడుపుతోన్న బాగోతం బయటపడింది. భార్య సడెన్ ఎంట్రీతో బిత్తరపోయిన భర్త, చెప్పులు చేత్తో పట్టుకొని గోడ దూకి ఎస్కేప్ అయ్యాడు. ఇక భర్త దొరక్కపోయినా ఇంట్లో ఉన్న ఆ ప్రైవేటు టీచర్‌ని చితకబాదింది శ్వేత. తన భర్తను దూరం చేసినందుకు తిట్టిపోసింది. శ్వేత ఇచ్చిన సమచారంతో పోలీసులు అక్కడికి వచ్చి, ప్రైవేట్‌టీచర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.