ATM చోరీ కోసం యత్నించిన దొంగలు! ఊహించని ట్విస్ట్‌తో పరుగో పరుగు
హైదరాబాద్‌లో వరుస ఏటీఎం దోపిడీలు జరుగుతున్నాయి. పాత భద్రతా వ్యవస్థలున్న ఏటీఎంలను లక్ష్యంగా చేసుకుంటున్న దొంగలు, CCTV కెమెరాలను ధ్వంసం చేసి నగదు దోచుకుంటున్నారు. రాచకొండ, సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమై, దొంగలను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మైలార్‌దేవ్‌పల్లిలోని ఏటీఎం దోపిడీ ప్రయత్నంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా దొంగలు పరారయ్యారు. రావిర్యాలలో జరిగిన దోపిడీలో సుమారు 30 లక్షల రూపాయలు దొంగలు ఎత్తుకెళ్లారు. పోలీసులు హర్యానాకు చెందిన మేవత్ గ్యాంగ్‌పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్‌లో వరుస ఏటీఎం చోరీలు జరుగుతున్నాయి. ఏటీఎం చోరీకి వచ్చి సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టి ఏటీఎంను లూటీ చేస్తున్నారు ఘరానా దొంగలు. రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వరుసగా చోరీలు జరగడంతో అలెర్ట్ అయిన పోలీసులు ఈ ఏటీఎం చోరీలపై నజర్ పెట్టారు. అయితే తాజాగా హైదరాబాద్ శివారు మైలార్ దేవ్ పల్లిలో ఏటీఎం చోరీ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఏటీఎం చోరీకి ప్రయత్నించిన సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో చోరీకి వచ్చిన దొంగలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుజీవుడా అంటూ పరుగులు తీశారు. కాగా, మహేశ్వరం మండలంలోని రావిర్యాలలోని SBI ఏటిఎంలో చోరీ చేసిన దుండగులే ఈ చోరీకి యత్నయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మైలార్దేవ్పల్లిలో చోరీకి యత్నించే కంటే 30 నిమిషాల ముందు రావిర్యాలలో ఏటీఎంని గ్యాస్ కట్టర్ తో ధ్వంసం చేసి సుమారు 30 లక్షల రూపాయల వరకు దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ చోరీకి యత్నించిన దొంగలు హర్యానా రాష్ట్రానికి చెందిన మేవత్ గ్యాంగ్ గా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఇప్పటికే నిందితుల కోసం 8 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఓల్డ్ సెక్యూరిటీ సిస్టమ్ ఉన్న ఏటీఎంలను టార్గెట్ చేస్తున్నారని, చోరీకి పాల్పడిన వారిని పట్టుకునేందుకు రాచకొండ, సైబరాబాద్ పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే దుండగులు వాడిన కారుకు ఫేక్ నంబర్ ప్లేట్ అమర్చినట్టు గుర్తించారు. ఏటీఎంలో చోరీ అనంతరం ముంబై వైపు వెళ్ళినట్లు అనుమానిస్తున్నారు.
మార్చ్ 1న కర్ణాటకలోని హోస్‌కోటేలో ఇదే తరహా దోపిడీ జరిగినట్లు తెలుస్తుంది. రావిరాలలో దోపిడీ చేసే ముందు ఏటీఎంలోకి ప్రవేశించి సీసీ కెమెరాలపై స్ప్రే చల్లి 30 లక్షల రూపాయలు దొచుకున్నారు. దొంగలు రావిరాల, కర్ణాటకలోనూ ఒక విధమైన విధానం పాటించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసు విషయంలో కర్ణాటక పోలీసులతో రాచకొండ పోలీసులు సమన్వయం చేసుకుంటున్నారు. రావిర్యాల గ్రామంలో గ్యాస్ కట్టర్ సహాయంతో నాలుగు నిమిషాల్లో చోరీ చేసిన దొంగలు.. సుమారు 30 లక్షల రూపాయల నగదుతో ఉడాయించారు. అలా వెళ్తూనే మైలార్ దేవులపల్లిలోని మధుబన్ కాలనీలో ఎస్‌బీఐ ఏటీఎం చోరీకి దుండగులు యత్నించారు. కానీ, షార్ట్ సర్క్యూట్ కారణంగా దొంగలు అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు వెల్లడించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.