Telangana: మహిళల వస్త్రాధారణపై హోంమంత్రి మహమూద్ అలీ సంచలన వ్యాఖ్యలు

మహిళల వస్త్రాధారణపై రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ సంచల వ్యాఖ్యలు చేశారు. నిన్న హైదరాబాద్‌లో హిజాబ్ వివాదం తెలెత్తడంతో ఆయన స్పందించారు. మహిళలు పొట్టి దుస్తులు ధరించడం మంచిది కాదన్నారు. ముస్లీం మహిళలు బుర్ఖా వేసుకోవద్దని ఎవరూ చెప్పలేదని అన్నారు.

Telangana: మహిళల వస్త్రాధారణపై హోంమంత్రి మహమూద్ అలీ సంచలన వ్యాఖ్యలు
Home Minister Mahmood Ali
Follow us
Aravind B

|

Updated on: Jun 17, 2023 | 12:51 PM

మహిళల వస్త్రాధారణపై రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ సంచల వ్యాఖ్యలు చేశారు. నిన్న హైదరాబాద్‌లో హిజాబ్ వివాదం తెలెత్తడంతో ఆయన స్పందించారు. మహిళలు పొట్టి దుస్తులు ధరించడం మంచిది కాదన్నారు. ముస్లీం మహిళలు బుర్ఖా వేసుకోవద్దని ఎవరూ చెప్పలేదని అన్నారు. హిందూ మహిళల తరహాలోనే ముస్లీం మహిళలు కూడా దుస్తులు ధరించాలని సూచించారు. పొట్టి దుస్తులు ధరించడం వల్లే అనేక సమస్యలు వస్తున్నాయన్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే నిన్న హైదరాబాద్‌లో హిజాబ్‌పై వివాదం జరిగింది. కేవీ రంగారెడ్డి కళాశాలలో ఉర్దూ పరీక్ష రాసేందుకు కొందరు ముస్లిం విద్యార్థినిలు వెళ్లారు.

ఆ విద్యార్థినిలు హిజాబ్ వేసుకొని ఉన్నారు. దీంతో కళాశాల నిర్వాహకులు ఆ విద్యార్థినిలు పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. దీంతో అక్కడే విద్యార్థినిలు, వాళ్ల తల్లిదండ్రులు.. కళాశాల యాజమాన్యం మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. అయితే కళాశాల నిర్వాహకులు మాత్రం హిజాబ్ వేసుకొని వస్తే ఎట్టిపరిస్థితుల్లో పరీక్ష రాసేందుకు వీళ్లేదని చెప్పేశారు. ఇక చేసేదేమి లేక విద్యార్థినిలు హిజాబ్ తీసేసి పరీక్ష రాశారు. అనంతరం ఈ విషయంపై విద్యార్థినిలు, వారి తల్లిదండ్రులు మంత్రి మహమూద్ అలీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోరారు. ఇప్పడు తాజాగా మంత్రి మహమూద్ అలీ స్పందించి ఈ విషయంపై ఇలా వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..