AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Revanth Reddy: ధరణి పోర్టల్‎పై ఉన్నతస్థాయి సమీక్ష.. సీఎం రేవంత్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార నేపథ్యంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో కీలకమైనది ధరణి పోర్టల్ రద్దు. దీనిపై అనేక అరోపణలు వెల్లువెత్తాయి. ధరణి పేరిట అనేక భూ ఆక్రమణలకు గురయ్యాయని పెద్ద ఎత్తున దుమారం రేగింది. అయితే తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి ఈరోజు మొట్టమొదటి సారి ధరణి పోర్టల్‎పై సమీక్ష నిర్వహించనున్నారు.

CM Revanth Reddy: ధరణి పోర్టల్‎పై ఉన్నతస్థాయి సమీక్ష.. సీఎం రేవంత్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ
CM Revanth Reddy
Srikar T
|

Updated on: Dec 13, 2023 | 11:50 AM

Share

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార నేపథ్యంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో కీలకమైనది ధరణి పోర్టల్ రద్దు. దీనిపై అనేక అరోపణలు వెల్లువెత్తాయి. ధరణి పేరిట అనేక భూ ఆక్రమణలకు గురయ్యాయని పెద్ద ఎత్తున దుమారం రేగింది. అయితే తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి ఈరోజు మొట్టమొదటి సారి ధరణి పోర్టల్‎పై సమీక్ష నిర్వహించనున్నారు. దీని కోసం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటూ ఆ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ధరణి సమస్యల పరిష్కారానికి కమిటీ వేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

తాము అధికారంలోకి వచ్చాక ధరణిని రద్దు చేస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి. ధరణి పోర్టల్ వల్ల 50 ఏళ్ల క్రితం భూమి అమ్ముకొని విదేశాలకు వెళ్లిపోయిన వారి పేర్లు కూడా రికార్డుల్లోకి వచ్చాయన్నారు. అందుకే కబ్జాలు పెరిగిపోయాయని తీవ్రంగా ఆరోపించారు. రేవంత్ రెడ్డితో పాటూ కాంగ్రెస్ నేతలంతా ధరణి పోర్టల్ సమస్యలకు నిలయంగా మారిందని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తమకు ఒక అవకాశం ఇవ్వండి.. కాంగ్రెస పార్టీ అధికారంలోకి వచ్చాక ధరణి పోర్టల్ ను రద్దు చేసి కొత్త రెవెన్యూ వ్యవస్థను తీసుకొస్తామని చెప్పిన విషయం మనకు తెలిసిందే. ఇందులో భాగంగా ఆయా శాఖల ఉన్నతాధికారులతో ఈరోజు మధ్యాహ్నం రివ్యూ మీటింగ్ జరగనుంది. ధరణి పోర్టల్ వల్ల ఏ భూమి ఎవరి పేరు మీద ఉంది.. ఎప్పుడు రిజిస్టర్ అయింది.. అన్న పూర్తి వివరాలు సింగిల్ క్లిక్‎తో బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ధరణి రద్దు చేస్తే రైతు బంధు ఆగిపోతుందని గత పాలకులు చెబితే.. అసలు ధరణికి రైతుబంధుకు సంబంధం లేదని బదులిచ్చారు రేవంత్.

ధరణి రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో లేదని.. ఐఎల్‎అండ్‎ఎఫ్‎ఎస్ అనే దళారి కంపెనీ చేతిలో ఉంది అన్నారు. ఇలాంటి బలమైన ఆరోపణ, ప్రతి ఆరోపణల నడుమ ప్రచారం సాగిన వేళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో ధరణిపై ముఖ్యమంత్రి రేవంత్ సమీక్షలు జరిపి ఏవిధమైన చర్యలు తీసుకుంటారో అన్న ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..

బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌