AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bandi Sanjay: అభివృద్ధితో పాటు.. హిందూత్వ ఎజెండాతో ప్రజల్లోకి.. మరోసారి ఎంపీగా పోటీ రెఢి అయిన బండి సంజయ్ సిద్ధం

కరీంనగర్ జిల్లాలో మరోసారి ఎన్నికల వేడి రాజుకుంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి వారం రోజులు గడువక ముందే, ఇక్కడ మాత్రంఎన్నికల మూడ్‌లోకి వెళ్తున్నారు రాజకీయ నేతలు. ముఖ్యంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ కరీంనగర్‌పై ఫోకస్ పెట్టారు.

Bandi Sanjay: అభివృద్ధితో పాటు.. హిందూత్వ ఎజెండాతో ప్రజల్లోకి.. మరోసారి ఎంపీగా పోటీ రెఢి అయిన బండి సంజయ్ సిద్ధం
Bandi Sanjay
G Sampath Kumar
| Edited By: Balaraju Goud|

Updated on: Dec 13, 2023 | 11:23 AM

Share

భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్.. మరోసారి కరీంనగర్ పార్లమెంటు సభ్యులుగా పోటీ చేయడానికి సన్నద్ధమవుతున్నారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తరువాత ఇక్కడే మకాం వేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమావేశాలకు ప్లాన్ చేసుకుంటున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ నియోజకవర్గాల్లో వచ్చిన ఓట్లను పరిశీలిస్తున్నారు. గత ఎన్నికలతో పోలీస్తే గణనీయంగా ఓటింగ్ శాతం పెరిగింది. దీంతో పాటు ఎలాంటి లోటు పాట్లు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. ముఖ్యంగా పని చేసుకుంటూ ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నారు. కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల్లో సంజయ్ పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చారు. స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మరోసారి లోక్‌సభ బరిలో నిలిచి గెలిచేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

కరీంనగర్ జిల్లాలో మరోసారి ఎన్నికల వేడి రాజుకుంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి వారం రోజులు గడువక ముందే, ఇక్కడ మాత్రంఎన్నికల మూడ్‌లోకి వెళ్తున్నారు రాజకీయ నేతలు. ముఖ్యంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ కరీంనగర్‌పై ఫోకస్ పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఓటమి చవి చూశారు. ఆయన దాదాపు 3 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓటమి పాలయ్యారు. అయితే అనుహ్యంగా తరువాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విజయం. సాధించారు. ఈనేపథ్యంలోనే ప్రస్తుతం మరోసారి ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తరువాత కరీంనగర్‌లో ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు బండి సంజయ్. ఎవరూ ఆదైర్యపడవద్దని సూచిస్తున్నారు. ఎంపీగా మరోసారి పోటీ చేస్తున్నానని, కష్టపడి పార్టీ విజయం కోసం పని చేయాలని కార్యకర్తలకు కోరారు. కరీంనగర్‌లో ఓడిపోయిన 89 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. అంతేకాకుండా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో హుస్నాబాద్ మినహా, మిగతా ఆరు నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం పెరిగింది. కరీంనగర్ తో పాటు హుజురాబాద్లో రెండవ స్థానంలో నిలిచింది భారతీయ జనతా పార్టీ. ఈసారి ఓటింగ్ శాతం పెరగడంతో పాటు క్యాడర్ కూడా పెరిగింది. దీంతోమరోసారి గెలిచేందుకు సన్నద్ధమవుతున్నారు.

పార్లమెంట్ సమావేశాల తరువాత ఇక్కడే మకాం వేయాలని భావిస్తున్నారు బండి సంజయ్. లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా, పార్లమెంట్ ఎన్నికల కోసం నియోజకవర్గాల వారీగా ఇంచార్జీలను నియమించాలని భావిస్తున్నారు. అయితే, ఎంపీ టికెట్ కోసం ఇద్దరు, ముగ్గురు సీనియర్ నేతలు సైతం ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. తమకే టికెట్ వస్తుందనే ప్రచారం చేసుకుంటున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ మినహా, మిగతా చోట్ల కనీస ఓట్లు కూడా రాలేదు. అయినప్పటికీ, సంజయ్ విజయం సాధించారు. ఇప్పుడు ఓటింగ్ శాతం పెరగడంతో బలమైన, క్యాడర్ ఉండటంతో గెలుస్తామనే ధీమాతో ఉన్నారు నేతలు. మరోసారి, బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో పొన్నం ప్రభాకర్ పోటీ చేశారు. ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రి అయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో కొత్త వ్యక్తికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే, కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఈసారి, త్రిముఖ పోరు ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

అయినప్పటికీ బండి సంజయ్ కుమార్ మరోసారి టికెట్ నాదే, విజయం నాదే అన్న ధీమాలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధితో పాటు హిందూత్వ ఎజెండాను నమ్ముకుని, మరోసారి బరిలోకి దిగుతున్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హిందూత్వ సెంటిమెంట్ పని చేసిందని, అందుచేత ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు.. హిందూత్వ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు బండి సంజయ్. అంతేకాదు, ఈసారి సంజయ్ గెలిస్తే, కేంద్ర మంత్రి పదవి వస్తుందనే ప్రచారం కూడా జరుగుతుంది. మూడవ సారి ఖచ్చితంగా మోదీ ప్రభుత్వం వస్తుందనే ధీమాతో ఉన్నారు బీజేపీ శ్రేణులు.

బండి సంజయ్ ఈసారి సార్వత్రిక ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆయన రాజకీయ భష్యత్ ను కూడా ఈ ఎన్నికలే నిర్ణయించనున్నాయి. అయితే.. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు మాత్రం సంజయ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎంపీగా ఉండి, ఒక్క పైసా కూడా తీసుకరాలేదని ఆరోపిస్తున్నారు. మరోవైపు తాను చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తానని అంటున్నారు బండి సంజయ్ కుమార్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…