సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వైసీపీ ఎంపీ పిటిషన్.. విజయసాయిరెడ్డి విజ్ఞప్తి తోసిపుచ్చిన హైకోర్టు..

Balaraju Goud

Balaraju Goud |

Updated on: Aug 10, 2021 | 2:55 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు వ్యవహారంలో ఎంపీ విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.

సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వైసీపీ ఎంపీ పిటిషన్.. విజయసాయిరెడ్డి విజ్ఞప్తి తోసిపుచ్చిన హైకోర్టు..
High Court

MP Vijaysai Reddy High Court Petition: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు వ్యవహారంలో ఎంపీ విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. తొలుత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్‌కు సంబంధించిన కేసులను విచారణ జరపాలని సీబీఐ కోర్టు నిర్ణయించింది. సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ విజయసాయిరెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మొదట సీబీఐ కేసులు.. లేదంటే సీబీఐ, ఈడీ రెండు కేసులూ సమాంతరంగా విచారించేలా ఆదేశాలివ్వాలని విజయ సాయిరెడ్డి హైకోర్టుకు విన్నవించుకున్నారు. దీంతో హైకోర్టు సైతం విజయసాయిరెడ్డి వాదనలను తోసిపుచ్చుతూ సీబీఐ కోర్టు నిర్ణయాన్నే సమర్థించింది. మరోవైపు, ఇదే అంశంపై జగతి పబ్లికేషన్స్‌, రఘురాం సిమెంట్స్‌ దాఖలు చేసిన పిటిషన్లనూ ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.

Read Also…  

Gas Subsidies: కేంద్ర సర్కార్‌ గ్యాస్‌ సిలిండర్లపై అందించిన గ్యాస్ సబ్సిడీ ఎంతో తెలుసా..?

IND vs ENG: టీమిండియా కెప్టెన్ గోల్డెన్ డక్ పెద్ద విషయం కాదు.. బలంగా తిరిగొచ్చి బదులిస్తాడు: మాజీ పాకిస్తాన్ కెప్టెన్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu