Telangana Corona: తెలంగాణ కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ.. కీలక ఆదేశాలు జారీ చేసిన న్యాయస్థానం

Telangana Corona: కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. తాజాగా తెలంగాణలో పాజిటివ్‌ కేసుల సంఖ్య కాస్త తగ్గుతోంది. ఇక తెలంగాణ కరోనా పరిస్థితులపై హైకోర్టులో సోమవారం..

Telangana Corona: తెలంగాణ కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ.. కీలక ఆదేశాలు జారీ చేసిన న్యాయస్థానం
Telangana High Court
Follow us

|

Updated on: May 17, 2021 | 4:40 PM

Telangana Corona: కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. తాజాగా తెలంగాణలో పాజిటివ్‌ కేసుల సంఖ్య కాస్త తగ్గుతోంది. ఇక తెలంగాణ కరోనా పరిస్థితులపై హైకోర్టులో సోమవారం సుదీర్ఘ విచారణ జరిగింది. ఈ విచారణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వంపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కోర్టు కీలక ఆదేశాలు, సూచనలు జారీ చేసింది. ఇతర రాష్ట్రాల లాగా తెలంగాణలో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించింది. వ్యాక్సినేషన్‌ విషయంలో తెలంగాణ 15వ స్థానంలో ఉందని పిటిషనర్‌ కోర్టుకు తెలిపారు.

ఆస్పత్రుల దోపిడీపై కోర్టు సీరియస్‌..

మరోవైపు ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీపై కూడా హైకోర్టు సీరియస్‌ అయ్యింది. కరోనా మొదటి దశలో ప్రైవేటు ఆస్పత్రుల ఛార్జీలపై ముగ్గురు ఐఏఎస్‌లతో కూడిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఏర్పాటు చేశారు. కానీ రెండో దశలో కరోనా తీవ్రంగా ఉన్నా చర్యలు తీసుకోవడం లేదని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రుల ఛార్జీలపై టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ముఖ్యంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో సిటిస్కాన్‌, ఇతర పరీక్షలకు ధరలు నిర్ణయించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గతంలో ఇచ్చిన జీవో ఇప్పుడు సరిపోదని కోర్టు అభిప్రాయపడింది. కొత్తగా ధరలపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

ఇవీ కూడా చదవండి:

Google Assistant: గూగుల్ అసిస్టెంట్ నుంచి త్వరలోనే కొత్త అప్‌డేట్ .. రంగు రంగుల రూపంలో డార్క్‌ థీమ్‌

Black Fungus: తెలుగు రాష్ట్రాలపై బ్లాక్ ఫంగస్ పంజా… మందుల కొరతతో రోగులకు ప్రాణ సంకటం

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..