Google Assistant: గూగుల్ అసిస్టెంట్ నుంచి త్వరలోనే కొత్త అప్‌డేట్ .. రంగు రంగుల రూపంలో డార్క్ థీమ్
Google Assistant: ఇంటర్నెట్ సెర్చ్ కంపెనీ గూగుల్ త్వరలోనే సరికొత్త రంగురంగుల యూజర్ ఇంటర్ ఫేస్ (యూఐ)ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. గూగుల్ UI చివరిసారిగా
Google Assistant: ఇంటర్నెట్ సెర్చ్ కంపెనీ గూగుల్ త్వరలోనే సరికొత్త రంగురంగుల యూజర్ ఇంటర్ ఫేస్ (యూఐ)ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. గూగుల్ UI చివరిసారిగా దాని విజువల్ రిఫ్రెష్‌ను 2019 చివరిలో రోల్ అవుట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇది 2020 ప్రారంభంలో అందుబాటులోకి వచ్చింది. దీంతో ఇప్పుడు రంగురంగుల రూపంలో గల డార్క్ థీమ్‌ను రూపొందించే పనిలో నిమగ్నమైనట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. త్వరలోనే ఈ సరికొత్త యూఐ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్స్‌డీఏ (XDA)- డెవలపర్ టిప్‌స్టర్ మాథ్యూ పిర్సజెల్ పేర్కొన్న వివరాల ప్రకారం.. గూగుల్ అసిస్టెంట్ తన థీమ్స్‌కు కొత్త రంగులను జోడించనుంది. దీని ద్వారా మీ ఫోన్ఆపరేషన్ కలర్ఫుల్గా మారుతుంది. దీని ద్వారా స్మార్ట్ఫోన్వాడే సమయంలో కొత్త అనుభూతి కలుగుతుంది. బయటి లైటింగ్, వెదర్ కండీషన్ బట్టి ఆటోమేటిక్‌గా గూగుల్ అసిస్టెంట్ మీ థీమ్ రంగులను మార్చేస్తుంది.అయితే, గూగుల్ ఈ రెండు రంగులనే ఎందుకు ఎంచుకున్నదనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేదని డెవలపర్ టిప్‌స్టర్ మాథ్యూ పిర్సజెల్ తెలిపారు.
మరో మూడు కొత్త ఫీచర్లు..
అయితే ఈ అప్‌డేట్ ఆండ్రాయిడ్ 12 మోనెట్ థీమింగ్‌ను పోలి ఉంటుందని ఎక్స్‌డీఏ స్పష్టం చేసింది. ఆండ్రాయిడ్ 12తో పనిచేసే స్మార్ట్ఫోన్లు వాడే కస్టమర్లు తమ వాల్‌పేపర్‌లో నుంచి తమకు నచ్చిన కలర్ ఎంచుకోవచ్చు. మోనెట్ థీమింగ్సిస్టమ్ నోటిఫికేషన్ బ్యాక్‌గ్రౌండ్, క్విక్ సెట్టింగ్ యాక్సెంట్, సెట్టింగ్స్ పేజీ, లాక్‌స్క్రీన్ వంటి బ్యాక్గ్రౌండ్లకు ఆటోమేటిక్‌గా కలర్స్‌ను మారుస్తుంది. అయితే ఈ ఫీచర్లు ఇప్పటికే సోనీ ఎక్స్‌పీరియా స్మార్ట్ఫోన్లలో అందుబాటులో ఉన్నట్లు టిప్స్టార్తెలిపింది. గూగుల్ అసిస్టెంట్ఇటీవలే మరో మూడు కొత్త ఫీచర్లను చేర్చింది. వాయిస్ బేస్ట్ అసిస్టెంట్అనే కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. దీని ద్వారా వ్యక్తుల సంభాషణను బట్టి వారిని గుర్తిస్తుంది. యూజర్ కాంటాక్ట్ లిస్ట్‌లోని పేర్లను సైతం పలుకుతుంది. రికార్డు చేయనప్పటికీ మీ వాయిస్, ఉచ్ఛారణను గుర్తుపట్టగలుగుతుంది. అయితే ప్రస్తుతం ఇంగ్లిష్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇక ఈ సదుపాయాన్ని అన్ని భాషలకు విస్తరించాలని గూగుల్భావిస్తోంది.