Amazon Mini TV: ఇకపై అమేజాన్‌లో వీడియోలను ఉచితంగా చూడొచ్చు.. కొత్త యాప్ తీసుకొచ్చిన ఆన్‌లైన్ దిగ్గజం..
Amazon Mini TV: ఓటీటీ రంగంలో ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది అమేజాన్ ప్రైమ్. ప్రస్తుతం అమేజాన్ నుంచి మరో కొత్త ఓటీటీ వచ్చింది. అమేజాన్ మినీ టీవీ పేరుతో వచ్చిన ఈ స్ట్రీమింగ్ సర్వీస్ పూర్తిగా ఉచితంగా...
Updated on: May 17, 2021 | 3:29 PM

అతి తక్కువ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది ప్రముఖ ఆన్‌లైన్ సైట్ అమేజాన్.

మొదట్లో ఆన్‌లైన్ షాపింగ్ మొదలు పెట్టిన అమేజాన్ అనంతరం. అమేజాన్ ప్రైమ్ పేరుతో కంటెంట్ రంగంలోకి కూడా వచ్చింది. ఈ క్రమంలోనే ఎన్నో వెబ్ సిరీస్‌లు, సినిమాలను విడుదల చేస్తూ ఓటీటీలో అగ్రస్థానాన్ని సంపాదించుకుంది.

అయితే అమేజాన్ ప్రైమ్ కోసం కొంత మొత్తాన్ని కేటాయించి సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా తాజాగా అమేజాన్ యూజర్ల కోసం ఫ్రీ సర్వీస్ తీసుకొచ్చింది.

అమేజాన్ మినీ టీవీ పేరుతో తీసుకొచ్చిన ఈ యాప్ ద్వారా యూజర్లకు ఉచితంగా కంటెంట్‌ను అందిస్తోంది. ఇందులో భాగంగా వెబ్ సిరీస్‌తో పాటు పలు షోలను అందించనుంది.

అమేజాన్ ప్రైమ్‌లో ఎలాంటి ప్రకటనలు రావనే విషయం తెలిసిందే. కానీ.. ఈ కొత్త యాప్‌లో మాత్రం మధ్యలో యాడ్స్ వస్తాయి.

ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉన్న ఈ యాప్‌ను త్వరలోనే ఐఓస్‌లోకి తీసుకురానున్నారు.




