హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్‌ నగరంలో భారీ వర్షం కురిసింది. మాదాపూర్, హైటెక్‌ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, కోఠి, ఉప్పల్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, అల్వాల్, కూకట్ పల్లి, నాగోల్, చింతల్, రామాంతాపూర్..

హైదరాబాద్‌లో భారీ వర్షం
Follow us

| Edited By:

Updated on: Apr 09, 2020 | 5:14 PM

హైదరాబాద్‌ నగరంలో భారీ వర్షం కురిసింది. భీకరమైన గాలులతో.. ఉరుముల మెరుపులతో కూడిన వర్షం పడింది. మాదాపూర్, హైటెక్‌ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, కోఠి, ఉప్పల్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, అల్వాల్, కూకట్ పల్లి, నాగోల్, చింతల్, రామాంతాపూర్, బాలాజీ నగర్ ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో కరెంట్ కూడా పోయింది. గత రెండు, మూడు రోజుల నుంచి తెలంగాణలోని అన్ని రాష్ట్రాల్లోనూ భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం నుంచి పలు ప్రాంతాల్లో వర్షం చిన్నగా మొదలైనా.. సిటీ అంతటా దట్టమైన నల్లమబ్బులు కమ్ముకుని.. సాయంత్రం వేళ వర్షం పడింది. అయితే.. ఈ అకాల వర్షానికి రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మిరప, మామిడి, జీడి తోట రైతులకు నష్టం కలిగే అవకాశం ఉంది. కాగా ఇప్పుడు కరోనా విజృంభణ ఎక్కువగా ఉంది. ఈ సమయంలో వర్షం కురిస్తే మరింత నష్టం కలిగే ప్రమాదముందని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

కరోనాపై పోరుకు భారీ ప్యాకేజీ సిద్ధం చేసిన కేంద్రం

కరోనా ఇంపాక్ట్: రిజర్వ్ బ్యాంకులో వెయ్యి కోట్లు అప్పుతీసుకున్న ఏపీ ప్రభుత్వం

బస్ టికెట్ రిజర్వేషన్లు ఆపేసిన ఏపీఎస్ఆర్టీసీ..

మరో టాస్క్ ఇచ్చిన ప్రధాని.. ఈ సారి ఏం చేయాలంటే?

గుడ్‌న్యూస్: ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి రూ.6 లక్షల ఇన్సూరెన్స్..