గుడ్‌న్యూస్: ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి రూ.6 లక్షల ఇన్సూరెన్స్..

మీకు EPF (ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్) అకౌంట్ ఉందా? అయితే ఈ గుడ్‌న్యూస్ మీకోసమే. ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్లకు వచ్చే లాభాలపై మీకు అవగాహన ఉందా? ఇది తెలియక పోతే మీరు ఇన్స్యూరెన్స్ కోల్పోయే ప్రమాదం..

గుడ్‌న్యూస్: ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి రూ.6 లక్షల ఇన్సూరెన్స్..
Covid-19 second Wave advances
Follow us

| Edited By:

Updated on: Apr 08, 2020 | 8:42 PM

మీకు EPF (ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్) అకౌంట్ ఉందా? అయితే ఈ గుడ్‌న్యూస్ మీకోసమే. ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్లకు వచ్చే లాభాలపై మీకు అవగాహన ఉందా? ఇది తెలియక పోతే మీరు ఇన్స్యూరెన్స్ కోల్పోయే ప్రమాదం ఉంది. ఈపీఎఫ్ అకౌంట్ ఉన్న ప్రతీ ఒక్కరూ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) నిర్వహించే ‘ఈడీఎల్ఐ’ (EDLI) స్కీమ్‌కు అర్హులే. అయితే దీని గురించి చాలా మందికి తెలియకపోవచ్చు.

అసలు ఈడీఎల్ఐ స్కీమ్ ఏంటంటే? ఇది బీమా పథకం. అంటే ఈపీఎఫ్ ఖాతాదారులందరికీ ఈపీఎఫ్‌ఓ అందించే బీమా ప్రయోజనం. ఇటీవల ఈ స్కీమ్‌కి సంబంధించి కొన్ని సవరణలు చేసింది ఈపీఎఫ్‌ఓ. ఎక్కువ మంది ఈపీఎఫ్ ఖాతాదారులకు ఈ ఇన్సూరెన్స్ లాభాలు అందించేందుకు ఈపీఎఫ్ఓ అధికారులు ఓ నిర్ణయం తీసుకున్నారు. ఈపీఎఫ్ సబ్‌స్కైబర్ చనిపోవడానికి ముందు ఒక సంవత్సరానికి ముందు ఒక సంస్థ లేదా అంతకంటే ఎక్కువ కంపెనీల్లో పనిచేసి సర్వీసులో మరణించినట్టైతే వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ బీమా ప్రయోజనం కల్పించాలని EPFO నిర్ణయం తీసుకుంది. గతంలో ఇలాంటి నియమాలు ఉండేవి కావు.

కానీ కొన్ని సవరణల ద్వారా.. ఈ బీమా వచ్చేలా చేసింది EPFO. ఈ స్కీమ్ ద్వారా రరూ.2.5 నుంచి రూ.6 లక్షల వరకు ఉచితంగా బీమా పొందవచ్చు. ఈపీఎఫ్ ఖాతాదారులు సర్వీసులో ఉండగా మరణిస్తేనే.. సంబంధించిన నామినీకి ఈ బీమా మొత్తం లభిస్తుంది. అయితే ఈడీఎల్ఐ స్కీమ్ నెలకు బేసిక్ సాలరీ రూ.15 వేల లోపు ఉన్నవారందరికీ వర్తిస్తుంది. బేసిక్ సాలరీ రూ.15 వేలు దాటితే గరిష్టంగా రూ.6 లక్షల వరకే బీమా ఉంటుంది.

అయితే ఈడీఎల్ స్కీమ్‌లో చేరడానికి ఉద్యోగులు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎంప్లాయిర్ మాత్రం బేసిక్ సాలరీలో రూ.5 శాతం లేదా గరిష్టంగా 75 రూపాయలు ప్రతీ నెల చెల్లించాల్సి ఉంటుంది. ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్ చనిపోతే నామినీ ఈ బీమాను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందుకోసం చనిపోయిన వ్యక్తి డెత్ సర్టిఫికేట్, ఫామ్ 5 ఐఎఫ్, నామినీ అకౌంట్‌కు చెందిన క్యాన్సల్డ్ చెక్ కావాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి: 

తెలంగాణ ప్రభుత్వానికి.. ‘మొగలి రేకులు’ ఫేమ్ ఆర్కే నాయుడు విరాళం

ఏప్రిల్ 11న ప్రధాని మోదీ కీలక నిర్ణయం.. సీఎంలతో మరోసారి కాన్ఫరెన్స్

హైదరాబాద్‌ రోడ్లపై చక్కర్లు కొడుతున్న ‘కరోనా కారు’

తెలంగాణలో హాట్‌ స్పాట్‌లుగా వంద ప్రదేశాలు.. మరింత కట్టుదిట్టం

అరుదైన ఘనత సాధించిన తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి..

హెడ్ కానిస్టేబుల్‌కు క్లాస్ పీకిన వైసీపీ ఎమ్మెల్యే

కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం
కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం
ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్..జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్..జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా
కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా
99లకే మల్టీప్లెక్స్ మూవీ టికెట్.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే?
99లకే మల్టీప్లెక్స్ మూవీ టికెట్.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే?
రాయి తంత్రం ఎవరిది? కాపు మంత్రం ఫలిస్తుందా? ఏపీలో పొలిటికల్ హీట్
రాయి తంత్రం ఎవరిది? కాపు మంత్రం ఫలిస్తుందా? ఏపీలో పొలిటికల్ హీట్
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్లీ వస్తుందా.. రీజన్, లక్షణాల ఏమిటంటే
యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్లీ వస్తుందా.. రీజన్, లక్షణాల ఏమిటంటే
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??