Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 73 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 173763. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 86422. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 82370. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4971. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • లాక్‌డౌన్‌పై స్పష్టతనిచ్చిన కేంద్ర ప్రభుత్వం. కంటైన్మెంట్ జోన్లలో జూన్ 30 వరకు లాక్‌డౌన్ కొనసాగింపు. మిగతా ప్రాంతాల్లో దశలవారిగా ఆంక్షల తొలగింపు. రాత్రి పూట కర్ఫ్యూ కొనసాగింపు సమయం రాత్రి 9.00 నుంచి ఉదయం గం. 5.00 వరకు
  • నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంశంలో నిన్నటి హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో కెవియట్ పిటిషన్ దాఖలు. కెవియట్ దాఖలు చేసిన ఏఐసీసీ కార్యదర్శి మస్తాన్ వలీ.
  • కరోనా పేషంట్స్ కోసం రోబోట్ రూపకల్పన. కరోనా రోగులకు మెడిషన్, ఆహారాన్ని అందించడం కోసం ఔరంగాబాద్‌లో రోబోట్ రూపకల్పన. మహారాష్ట్ర లో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థి సాయి సురేష్ రూపొందించాడు.
  • దేశ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన సికింద్రాబాద్ ప్రజలకు, ప్రధాని మోదీకి, పార్టీ పెద్దలకు ధన్యవాదాలు. 200కు పైగా దేశాలు కరోనా బారిన పడ్డాయి. ప్రపంచంలో ఏదేశంతో పోల్చి చూసినా భారత్ మెరుగైన పరిస్థితిలో ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునైటెడ్ నేషన్స్ అభినందిస్తున్నాయి. ఏ కొలమానంతో పోల్చి చూసినా భారత్ అత్యంత మెరుగ్గా పనిచేసింది. కిషన్ రెడ్డి, హోం సహాయ మంత్రి.
  • అవుటర్ టోల్ గేట్ల వద్ద క్యాష్ లెస్ ట్రాన్సక్షన్స్ ప్రాధాన్యత. కరోనా నేపథ్యంలో క్యాష్ లెస్ ట్రాన్సక్షన్స్ ప్రాధాన్యత అంటున్న హెచ్ ఎం డి ఏ. ఓ ఆర్ ఆర్ పై రికార్డు స్థాయిలో ఫాస్టాగ్ యూజర్స్. నిత్యం ప్రయాణించే లక్షా 30 వేల వాహనాల్లో 60 వేలు ఫాస్టాగ్​ యూజర్స్​ . 2018 డిసెంబర్​ 11వ తేదీ నుంచి అమలులోనికి వచ్చిన ఫాస్టాగ్​ నిబంధనలు . ఫాస్టాగ్​ లేని వాహనదారులు నగదు రహిత లావాదేవీలు జరపాలంటున్న హెచ్​ఎండిఏ.
  • వందేభారత్ మిషన్ లో భాగంగా ఢిల్లీ నుండి మాస్కోకు వెళుతున్న ఎయిర్ ఇండియా (AI-1945) పైలెట్ కి కరోనా పాజిటివ్. కరోనా పాజిటివ్ రావడం తో ఫ్లైట్ వెనక్కి తిరిగి వస్తుందని అధికారులు వెల్లడి.

మరో టాస్క్ ఇచ్చిన ప్రధాని.. ఈ సారి ఏం చేయాలంటే?

ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మళ్లీ ఏ టాస్క్ ఇస్తారో అని దేశ ప్రజలంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో కరోనాను కట్టడి ఎంతో శ్రమిస్తున్న మోదీకి ప్రజలంతా కృతజ్ఞత చెప్పాలంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు..
Adopt a poor family if you want to show true solidarity with me says PM Modi, మరో టాస్క్ ఇచ్చిన ప్రధాని.. ఈ సారి ఏం చేయాలంటే?

భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వ ఎన్నో చర్యలు తీసుకుంటోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కరోనా స్ప్రెడ్ అవ్వకుండా.. ఇప్పటికే దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించారు. కరోనా మహమ్మారి సంక్షోభం నుంచి దేశాన్ని కాపాడేందుకు ప్రధాని మోదీ ఎంతో కృషి చేస్తున్నారు. అధికారులతో, అన్ని రాష్ట్రాల సీఎంలతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ.. తగిన చర్యలు తీసుకుంటున్నారు.

అయితే ఈక్రమంలో కరోనాపై యుద్ధం చేస్తున్న వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులను అభినందించేందుకు మార్చి 22న సాయంత్రం 5 గంటలకు చప్పట్లు కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు మోదీ. అలాగే ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్లు ఆర్పివేసి దీపాలు లేదా కొవ్వుత్తులు, ఫ్లాష్ లైట్లు లేదా టార్చ్ లైట్లు వెలిగించాలని విజ్ఞప్తి చేశారు. దేశ సమైక్యతను చాటిచెప్పేందుకు మోదీ పిలుపునివ్వగా.. ఈ రెండు కార్యక్రమాల్ని దేశ ప్రజలంతా విజయవంతం చేశారు.

ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మళ్లీ ఏ టాస్క్ ఇస్తారో అని దేశ ప్రజలంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో కరోనాను కట్టడి ఎంతో శ్రమిస్తున్న మోదీకి ప్రజలంతా కృతజ్ఞత చెప్పాలంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ నెల 12వ తేదీ అనగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఐదు నిమిషాల పాటు ప్రజలంతా ఇంటి బాల్కనీల్లో నిలబడి ప్రధాని మోదీకి సెల్యూట్ చేయాలని కొందరు అభిమానులు పిలుపునిచ్చారు. దానికి కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.

కాగా.. ఈ విషయం కాస్తా ప్రధానమంత్రి దృష్టికి వెళ్లింది. దానిపై స్పదించిన మోదీ తనను నిజంగా ప్రేమించేవారు ఉంటే ఒక పేద కుటుంబాన్ని దత్తత తీసుకోవాలని.. ఇలాంటి ఫేక్ న్యూస్‌ కాకుండా ఒక పేద కుటుంబాన్ని దత్తత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి: 

గుడ్‌న్యూస్: ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి రూ.6 లక్షల ఇన్సూరెన్స్..

తెలంగాణ ప్రభుత్వానికి.. ‘మొగలి రేకులు’ ఫేమ్ ఆర్కే నాయుడు విరాళం

ఏప్రిల్ 11న ప్రధాని మోదీ కీలక నిర్ణయం.. సీఎంలతో మరోసారి కాన్ఫరెన్స్

హైదరాబాద్‌ రోడ్లపై చక్కర్లు కొడుతున్న ‘కరోనా కారు’

తెలంగాణలో హాట్‌ స్పాట్‌లుగా వంద ప్రదేశాలు.. మరింత కట్టుదిట్టం

అరుదైన ఘనత సాధించిన తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి..

హెడ్ కానిస్టేబుల్‌కు క్లాస్ పీకిన వైసీపీ ఎమ్మెల్యే

Related Tags