Brahmamudi, April 26th episode: ఇంట్లో అపర్ణ బీభత్సం.. రుద్రాణికి చెమటలు పట్టించిన కావ్య, స్వప్నలు..

ఈ రోజు బ్రహ్ముముడి ఎపిసోడ్‌లో.. గుడిలో కళ్యాణం తర్వాత అందరూ ఇంటికి వస్తారు. మీడియా ప్రశ్నలతో విసుగెత్తిపోయిన అపర్ణ.. చాలా కోపంగా, ఆవేశంగా ఉంటుంది. నేను భయ పడిందే జరిగింది. ఆ బిడ్డ పుట్టుక మీద ప్రశ్న మొదలైంది. పెళ్లి అయి ఇన్ని సంవత్సరాలు అయింది. అబద్ధమే తెలీని నా నోటి నుంచి అబద్ధాన్ని చెప్పించారు అని అపర్ణ ఆవేశంలో ఊగి పోతుంది. నాకు సమాధానం కాదు.. పరిష్కారం కావాలి. ఇందుకే నేను గుడికి రానని చెప్పాను. కానీ ఈ ఇంటి పెద్దలు నా నోరు నొక్కేసారు. ఆ రాముడికి కళ్యాణం కాబట్టి..

Brahmamudi, April 26th episode: ఇంట్లో అపర్ణ బీభత్సం.. రుద్రాణికి చెమటలు పట్టించిన కావ్య, స్వప్నలు..
Brahmamudi
Follow us

|

Updated on: Apr 26, 2024 | 1:54 PM

ఈ రోజు బ్రహ్ముముడి ఎపిసోడ్‌లో.. గుడిలో కళ్యాణం తర్వాత అందరూ ఇంటికి వస్తారు. మీడియా ప్రశ్నలతో విసుగెత్తిపోయిన అపర్ణ.. చాలా కోపంగా, ఆవేశంగా ఉంటుంది. నేను భయ పడిందే జరిగింది. ఆ బిడ్డ పుట్టుక మీద ప్రశ్న మొదలైంది. పెళ్లి అయి ఇన్ని సంవత్సరాలు అయింది. అబద్ధమే తెలీని నా నోటి నుంచి అబద్ధాన్ని చెప్పించారు అని అపర్ణ ఆవేశంలో ఊగి పోతుంది. నాకు సమాధానం కాదు.. పరిష్కారం కావాలి. ఇందుకే నేను గుడికి రానని చెప్పాను. కానీ ఈ ఇంటి పెద్దలు నా నోరు నొక్కేసారు. ఆ రాముడికి కళ్యాణం కాబట్టి నేనూ ఏమీ మాట్లాడలేకపోయాను. ఇప్పుడు జరగాల్సింది అంతా జరిగింది కదా. దీని కారణం ఎవరు? లోకం ముందు నేను దోషిగా నిల్చోవల్సి వచ్చింది. అప్పుడే కావ్య రియాక్ట్ అవుతుంది. మీరు కేవలం మీ ఇంటి గౌరవం కోసమే అబద్ధం చెప్పారు కదా అత్తయ్యా అని అంటుంది. నోర్ముయ్.. పరువు అంటే ఏంటి? నువ్వేం చేశావ్? నీ బిడ్డా అని సమాధానం చెప్పావ్. ఈ బిడ్డ వారసుడివి అని చెప్తావ్? నీకే ఈ ఇంట్లో దిక్కు లేదు. ఈ ఇంట్లో నీకు స్థానమే లేదు. ఏ స్థానంలో ఉండి మీడియాకు సమాధానం చెప్పావ్? అని అరుస్తుంది.

అత్తని ఏకిపారేసిన కళావతి..

అపర్ణ మాటలకు కావ్య ఎంతో బాధ పడుతుంది. అవును నిజమే అత్తయ్యా.. ఈ ఇంట్లో విలువే లేదు. కోడిలిగా స్థానమే లేదు. గౌరవమే లేదు.. ఎవరూ నన్ను మనిషిగానే చూడరు. నేనంటే అబద్ధం చెప్పాను? మరి మీరెందుకు? అబద్ధం చెప్పారు అని అడుగుతుంది. మీరెందుకు మీ కొడుకు చేసిన అపరాధాన్ని బయట పెట్టలేదు? మీరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా.. మీ కొడుకు నా మెడలో తాళి కట్టాడన్నది నిజం. అంటే.. న్యాయంగా.. చట్ట పరంగా.. నేను ఆయన భార్యను. ఆ బిడ్డను ఇంటికి తీసుకొస్తే.. ఎవరికి అన్యాయం జరుగుతుంది? ముమ్మాటికీ నాకే. మీరు ఒక్కసారైనా మీ భార్య గతి ఏంటి? అని అడిగారా? ఒక్కసారైనా నాకు జరిగిన అన్యాయం గురించి నిలదీసారా? మీ కొడుకును మందలించారా? అయినా నేను భరించాను. సరిపెట్టుకున్నా.. ఏ గతీ లేక పడి ఉంటున్నా అని విమర్శించి వాళ్లకు నేను చెప్పే జవాబు కాదు ఇది.

కన్న తల్లివై మీరేం చేశారు..

నేను ఒక ఆడపిల్లను. నాకూ ఆత్మాభిమానం ఉంటుంది. నా ఉనికి అస్థిత్వంగా మారితే.. నా వ్యక్తిత్వం మాత్రమే నాకు మనో ధైర్యాన్ని ఇచ్చింది. ఈ పరిస్థితికి నేను బెదిరి పోలేదు. ఎక్కడి నుంచో వచ్చిన నేనే.. అన్నీ సరిపెట్టుకున్నా.. కన్న తల్లివై ఉండి మీరేం చేశారు? ఆయన ఇంట్లోనే అతిథిని చేశారు. ఆఫీస్ లో నుంచి తప్పించారు. ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్లి పొమ్మంటున్నారు. ఇంత చేసిన మీరు నాదే తప్పని ఎలా అంటారు? అని కావ్య నిలదీస్తుంది.

ఇవి కూడా చదవండి

కావ్యను నీ లెక్కంత అన్న అపర్ణ..

ఆపు.. చాలు ఆపూ.. నువ్వో త్యాగమూర్తివి. ఏం అర్హత ఉంది నీకు.. నన్ను నిలదీస్తున్నావ్? నీ స్థానం ఎంత? నీ లెక్క ఎంత? అని అపర్ణ కావ్యపై విరుచుకు పడుతుంది. ఎవ్వరూ మాట్లాడకుండా నిలబడి చూస్తూ ఉంటారు. ఇప్పటి వరకూ ఈ కుటుంబానికి ఎలాంటి మచ్చ పడలేదు. ఇప్పుడు నీ భర్త ఒక బిడ్డను తీసుకొచ్చి వంశానికి మచ్చ తెచ్చాడు. చివరకు పెద్దావిడ లేచి.. చూడు అపర్ణా నీ ఆవేశంలో అర్థం లేదు. కాస్త ఆలోచించు మాట్లాడు. కావ్య అబద్ధం చెప్పినా.. నువ్వు అబద్ధం చెప్పినా ఈ ఇంటి గౌరవం కాపాడటం కోసమే కదా. ఏం చేస్తాం అబద్ధం చెప్పక తప్పలేదు. అలాంటి పరిస్థితులు వచ్చాయి. కానీ సమస్య నుంచి గట్టే మార్గాన్ని వెతకండి అని ఇందిరా దేవి చెబుతుంది.

మారని అపర్ణ నిర్ణయం..

అవును మీరు చెప్పింది నిజమే అత్తయ్యా.. నేను తప్పు చేశాను. వాడు బిడ్డను ఇంటికి తీసుకు వచ్చినప్పుడే ఇంటి నుంచి బయటకు గెంటేసి ఉండాల్సింది. అలా చేయకుండా ఇప్పటి వరకూ ఇంట్లో ఉండనివ్వడమే నేను చేసిన తప్పు. ఇప్పుడు పరిస్థితి ఇక్కడి దాకా వచ్చింది. చూడు రాజ్.. నేను నీకు వారం రోజులు గడువు ఇచ్చాను. అందుకు ఇంకా రెండు రోజులే ఉంది. ఈలోపు నువ్వు నిజం చెప్తే సరి.. లేదంటే నువ్వు ఇంట్లో నుంచి వెళ్లి పోవాల్సిందే. అందుకు ఎవరు అడ్డు పడినా నా శవాన్ని చూస్తారు అని చెప్పి వెళ్లి పోతుంది అపర్ణ.

రుద్రాణి, రాహుల్‌కి క్లాస్ పీకిన కావ్య, స్వప్నలు..

ఈ సీన్ కట్ చేస్తే.. రాహుల్, రుద్రాణి పక్కకు మనం అనుకున్నదే జరిగింది అని మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ల దగ్గరకు వెళ్లిన కావ్య.. మీరసలు మనుషులేనా? అని అడుగుతుంది. మాటలు మర్యాదగా రానీ కావ్య.. అని రుద్రాణి అడుగుతుంది. మీరు ఇంత చేసిన తర్వాత కూడా మీకు మర్యాదలు ఇవ్వాలా? మీరు ఎన్ని తప్పులు చేసినా ఇంట్లో వాళ్లు నెత్తిన పెట్టుకున్నారు. రాహుల్‌కి జాబ్ కూడా ఇచ్చారు. అయినా ఈ ఇంటి పరువే తీయ్యాలని చూస్తారా అని కావ్య అడుగుతుండగా.. అప్పుడే వచ్చిన స్వప్న.. వాళ్లు అసలు ఈ ఇంటి మనుషులు అని అనుకుంటేనే కదా కావ్యా.. ఎప్పుడు ఎవరు దొరుకుతారా? కింద పడేసి తొక్కుదామా అని చూస్తారు. మనిషి బ్రతికుండగానే పీక్కు తింటారు. సరే అందరి దగ్గరకూ వెళ్లి పంచాయితీ పెడదామని స్వప్న కావాలనే రుద్రాణి వాళ్లను బెదిరిస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని వదిలేస్తున్నా. కానీ ఇంకొక్కసారి తప్పు చేస్తే మాత్రం అస్సలు వదిలే ప్రసక్తే లేదని కావ్య అంటుంది. ఇక ఇద్దరికీ కలిపి క్లాస్ ఇస్తుంది కావ్య.

అప్పూని ఇరికించేందుకు రుద్రాణి – అనామిక ప్లాన్..

ఆ తర్వాత కావ్య, స్వప్నలు ఇచ్చిన క్లాస్‌కి రుద్రాణి రగిలిపోతూ ఉంటుంది. కావాలనే అనామిక దగ్గరకు వెళ్లి నిప్పు రాజేస్తుంది. అప్పటికి అనామిక ఏడుస్తుంది. నీకు ఆ ఏడుపే కరెక్ట్.. అని రుద్రాణి అంటే.. నేను ఏడుస్తుంటే మీకు నవ్వులాటగా ఉందా.. అసలు గుడిలో ఏం జరిగిందో తెలుసా? అని అనామిక చెప్పబోతుండగా.. అప్పూ ముందు నిన్ను కొట్టాడు నేను చూశాను. ఇంత జరిగిన తర్వాత కూడా ఏమీ చేయకుండా.. ఏడుస్తూ కూర్చుంటే నేనేం చేస్తాను అని రుద్రాణి అంటుంది. ప్రేమించిన వాడే.. ఆ అప్పూ ముందు కొడితే.. ఇంకేం చేస్తాను అని అనామిక అంటుంది. డబ్బున్నవాళ్లకు మోసంతో తప్పా.. మానంతో పని లేదు. కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి మాత్రం అలా కాదు.. మానం పోతే.. అన్నీ పోయినట్టే అనుకుంటారని రుద్రాణి అంటుంది. అర్థమైంది.. ఆ అప్పూ మానం పోవాలి. నలుగురిలో తల ఎత్తుకోలేక ఏడుస్తూ కూర్చోవాలి అని అనామిక అంటుంది. ఇక అప్పూని ఎలా దెబ్బ తీయ్యాలో చెప్తుంది రుద్రాణి. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్‌ ముగుస్తుంది.

Latest Articles
చెడు కొలెస్ట్రాల్‌ను తరిమికొట్టాలా? ప్రతిరోజూ ఉదయం ఈ ఆకును నమలండి
చెడు కొలెస్ట్రాల్‌ను తరిమికొట్టాలా? ప్రతిరోజూ ఉదయం ఈ ఆకును నమలండి
కొత్తిమీర గింజలను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తాగితే..
కొత్తిమీర గింజలను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తాగితే..
వేగం తగ్గింది సినిమాల్లో.. తనలో కాదు.! ట్రేండింగ్ స్టైల్ తో పూజా
వేగం తగ్గింది సినిమాల్లో.. తనలో కాదు.! ట్రేండింగ్ స్టైల్ తో పూజా
వయ్యారి సొగసరి.. అంజలి అందాలకు ఫిదా అవుతున్న యూత్. ఫోటోస్..
వయ్యారి సొగసరి.. అంజలి అందాలకు ఫిదా అవుతున్న యూత్. ఫోటోస్..
స్టైలిష్ డ్రెస్ లో మోడరన్ మేనకలా మెరిసిపోతున్న అమృత అయ్యర్.
స్టైలిష్ డ్రెస్ లో మోడరన్ మేనకలా మెరిసిపోతున్న అమృత అయ్యర్.
ఈవినింగ్ వాకింగ్ చేస్తే.. ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
ఈవినింగ్ వాకింగ్ చేస్తే.. ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
తెలుగు మీడియాలో మరో సంచలనం.. టీవీ9తో సీఎం జగన్‌ ఇంటర్వ్యూ..
తెలుగు మీడియాలో మరో సంచలనం.. టీవీ9తో సీఎం జగన్‌ ఇంటర్వ్యూ..
అఫీషియల్.. ఆహాలో గీతాంజలి మళ్లీ వచ్చింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అఫీషియల్.. ఆహాలో గీతాంజలి మళ్లీ వచ్చింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సులువుగా బరువు తగ్గాలంటే ఈ ఒక్క సూపర్ డ్రింక్‌ తాగితే సరి..
సులువుగా బరువు తగ్గాలంటే ఈ ఒక్క సూపర్ డ్రింక్‌ తాగితే సరి..
మీకు తెలుసా.. ఈ దేశాల్లోని ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తారట!
మీకు తెలుసా.. ఈ దేశాల్లోని ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తారట!
తెలుగు మీడియాలో మరో సంచలనం.. టీవీ9తో సీఎం జగన్‌ ఇంటర్వ్యూ..
తెలుగు మీడియాలో మరో సంచలనం.. టీవీ9తో సీఎం జగన్‌ ఇంటర్వ్యూ..
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..