AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uric Acid: యూరిక్ యాసిడ్ సమస్య వేధిస్తుందా..? ఈ ఆకులు నమిలితే పరార్

చాలా మందికి కాళ్ల నొప్పులు ఇబ్బంది పెడుతుంటాయి. పాదాలు, పాదాల వేళ్ల నొప్పులు, కీళ్ల నొప్పుల్లాంటివి కనిపిస్తుంటాయి. ఇలాంటివన్నీ మన శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ పెరుగుదలను లక్షణాలు కావచ్చు. విసర్జన సరిగా జరగకపోయినప్పుడు యూరిక్‌ యాసిడ్‌ రక్తంలోనే నిలిచిపోతుంది. క్రమంగా ఇది స్ఫటికాలుగా మారి కీళ్లు, వాటి చుట్టూ ఉండే కణజాలాల్లో పేరుకుపోతుంది.

Uric Acid: యూరిక్ యాసిడ్ సమస్య వేధిస్తుందా..? ఈ ఆకులు నమిలితే పరార్
Uric Acid
Ram Naramaneni
|

Updated on: Apr 26, 2024 | 1:59 PM

Share

యూరిక్ యాసిడ్ అనేది రక్తంలో కనిపించే వ్యర్థ పదార్థం. శరీరం ప్యూరిన్ అనే ముఖ్యమైన రసాయనాన్ని విచ్ఛిన్నం చేసినప్పుడు ఇది రిలీజ్ అవుతుంది. అదనపు యూరిక్ యాసిడ్ సాధారణంగా రక్తంలో కరిగి, మూత్రపిండాలు గుండా వెళ్లి.. మూత్రం ద్వారా శరీరం నుంచి బయటకు వస్తుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ అధికంగా రిలీజ్ అయినప్పుడు.. గౌట్, కిడ్నీలో రాళ్లు,  కీళ్ల నొప్పులతో సహా వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.  ఈ సమస్య నుంచి బయట పడటానికి తరచుగా మందులు వాడాల్సి ఉంటుంది. అయితే ఆయుర్వేదం యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రించడానికి కొన్ని నేచురల్ రెమిడిస్ ఫాలో అవ్వమని చెబుతుంది. కొన్ని రకాల ఆకులు వాటి యూరిక్ యాసిడ్‌కు చెక్ పెట్టేందుకు సాయపడతాయి. ఈ ఆకులను తినడం వల్ల అధిక యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రించవచ్చు.

తులసి:

తులసి ఔషధ గుణాలకు ప్రసిద్ధి. దీన్ని భారతదేశంలో పవిత్రమైన మొక్కగా భావిస్తారు. ఇది యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడే శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది. తులసి ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరాన్ని ఫ్యూరిఫై చేస్తుంది. తద్వారా యూరిక్ యాసిడ్ చేరడాన్ని నిరోధిస్తుంది.

వేప ఆకులు:

వేప ఆకులు శక్తివంతమైన డిటాక్సిఫైయింగ్ లక్షణాలను కలిగి ఉంటాయి.  రక్త శుద్దీకరణకు ఉపయోగపడతాయి. అదనపు యూరిక్ యాసిడ్‌ సహా ఇతర వ్యర్థాలను శరీరం నుంచి తొలగించడంలో ఇవి సహాయపడతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది అధిక యూరిక్ యాసిడ్ స్థాయిలతో సంబంధం ఉన్న లక్షణాలను ఉపశమనం చేస్తుంది.

తిప్పతీగ:

తిప్పతీగ ఆయుర్వేదంలో ఒక ప్రసిద్ధ మూలిక. ఇది రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను కలిగి ఉంది. యూరిక్ యాసిడ్ స్థాయిలను సమతుల్యం సహాయపడుతుంది. అధిక యూరిక్ యాసిడ్ వల్ల కీళ్ల నొప్పులు, వాపు నుండి ఉపశమనం పొందడంలో తిప్పతీగ సహాయపడుతుంది.

కొత్తిమీర:

కొత్తిమీరను సాధారణంగా ఆయుర్వేదంలో పలు ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. మంటను తగ్గించడంలో సహాయపడే సమ్మేళనాలను కొత్తిమేర కలిగి ఉంటుంది. శరీరం నుండి యూరిక్ యాసిడ్‌తో సహా టాక్సిన్స్‌ను కొత్తిమీర బయటకు పంపుతుంది.

త్రిఫల:

త్రిఫల బిభితకీ, అమలకీ, హరితకీ పండ్ల కలయిక. ఇది అధిక యూరిక్ యాసిడ్‌ను తగ్గించడంలో సహాయపడే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. ఇది గౌట్‌తో సంబంధం ఉన్న వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.