Telangana Rain Alert: ఇదేం కాలమో ఏమో! హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం.. తడిసి ముద్దైన పలు ప్రాంతాలు..

ఇది ఎండాకాలమో.. వానాకాలమో అర్థం కావడం లేదు. అదే పనిగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. హైదరాబాద్‌లో పలుచోట్ల మరోసారి భారీ వర్షం పడింది. ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, వనస్థలిపురం ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన భారీ వాన పడింది. ఈదురుగాలులతో కుండపోతగా కురిసిసింది.

Telangana Rain Alert: ఇదేం కాలమో ఏమో! హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం.. తడిసి ముద్దైన పలు ప్రాంతాలు..
Rains
Follow us
Shiva Prajapati

|

Updated on: May 10, 2023 | 7:07 PM

ఇది ఎండాకాలమో.. వానాకాలమో అర్థం కావడం లేదు. అదే పనిగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. హైదరాబాద్‌లో పలుచోట్ల మరోసారి భారీ వర్షం పడింది. ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, వనస్థలిపురం ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన భారీ వాన పడింది. ఈదురుగాలులతో కుండపోతగా కురిసిసింది. భారీ ఈదురుగాలులకు చెట్లు నేలకూలాయి. పలు చోట్ల విద్యుత్‌ సరఫరాలకు అంతరాయం ఏర్పడింది. ఘట్‌కేసర్‌లో వర్షం ధాటికి రోడ్డుపై చెట్లు విరిగిపడ్డాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం నీటిలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది.

జిల్లాలకు వర్ష సూచన..

పలు జిల్లాల్లో మరోసారి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే అకాల వర్షాలతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. కల్లాల్లోని పంట దిగుబడులను రక్షించుకునే అవకాశం కూడా లేకుండా వర్షాలు పడుతున్నాయి. ధాన్యం, మొక్కజొన్న తదితర పంటలు మొలకెత్తాయి. ఈ పరిస్థితుల్లో వాతావరణశాఖ తుఫాన్‌ హెచ్చరికలతో రైతుల్లో మరింత ఆందోళన నెలకొంది. తుఫాను హెచ్చరికతో రైతుల కంటిపై కునుకు ఉండటంలేదు. ధాన్యం, అకాల వర్షాలు మొక్కజొన్న, మిరప రైతులను కోలుకోలేని విధంగా దెబ్బ తీశాయి. చేతికి అందాల్సిన పంట వర్షార్పణం కావడంతో రైతులు కన్నీటి పర్యం తమవుతున్నారు.

ఏపీని కూడా వదలని వర్షాలు..

అటూ ఏపీని కూడా వర్షాలు వదలం లేదు. పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు పలు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. రేపు అల్లూరి జిల్లా రాజవొమంగి, అనకాపల్లి జిల్లా నాతవరం, కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రేపు 45, ఎల్లుండి 104 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వార్నింగ్‌ ఇచ్చింది. మిగిలిన చోట్ల ఎండ ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలిపింది. ఎండలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..