Kaleshwaram Project: రాజకీయాల కంటే రాష్ట్రమే ముఖ్యం.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై హరీష్‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్
Kaleshwaram Project: తుమ్మిడిహట్టి దగ్గర నీళ్లు తక్కువగా ఉంటాయని, అందుకే మేడిగడ్డ దగ్గర బ్యారేజీ నిర్మాణం చేపట్టామన్నారు. కాళేశ్వరంలో మూడు ఆప్షన్లు ఉన్నాయి.. వర్షాలు బాగాపడితే SRSP నుంచే నీళ్లు వస్తాయి.. ఎస్‌ఆర్‌ఎస్‌పీ, ఎల్లంపల్లికి నీళ్లు రానప్పుడే మేడిగడ్డ నుంచి నీటిని పంప్..

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది బీఆర్ఎస్. మాజీమంత్రి హరీష్‌రావు ఈ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్‌తో పాటు బీఆర్ఎస్ సీనియర్ నేతలు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని లైవ్‌లో వివరాలు అందించారు. రాజకీయాల కంటే రాష్ట్రమే మాకు ముఖ్యమన్న హరీష్‌రావు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ రాష్ట్రానికి ఒక జీవధారం అని అన్నారు. బీఆర్ఎస్‌పై బురదజల్లేందుకే ఆ ప్రాజెక్ట్‌కు మరమ్మత్తులు చేపట్టడం లేదన్నారు. కాళేశ్వరంలోని ఒక బ్యారేజీలోని రెండు పిల్లర్లు మాత్రమే కుంగిపోయాయని, దీన్ని అడ్డంపెట్టుకుని కాళేశ్వరం మొత్తం కుంగిపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Pin Code: ఇక పోస్టల్ పిన్‌కోడ్‌కు స్వస్తి.. భారత పోస్టల్ శాఖ కొత్త అడ్రస్సింగ్ వ్యవస్థ
తుమ్మిడిహట్టి దగ్గర నీళ్లు తక్కువగా ఉంటాయని, అందుకే మేడిగడ్డ దగ్గర బ్యారేజీ నిర్మాణం చేపట్టామన్నారు. కాళేశ్వరంలో మూడు ఆప్షన్లు ఉన్నాయి.. వర్షాలు బాగాపడితే SRSP నుంచే నీళ్లు వస్తాయి.. ఎస్‌ఆర్‌ఎస్‌పీ, ఎల్లంపల్లికి నీళ్లు రానప్పుడే మేడిగడ్డ నుంచి నీటిని పంప్ చేశామని పేర్కొన్నారు. కాళేశ్వరం నీళ్లు రాకుండానే పంట పండిందని ప్రభుత్వం చెబుతోంది.. కానీ కాళేశ్వరంలో అంతర్భాగమైన ప్రాజెక్టుల కింద పంటలు పండాయి. ఈ వ్యవస్థలన్నీ పని చేయడం వల్లే భారీ స్థాయిలో సాగు జరిగిందని, కాళేశ్వరం నీరు లేకుండానే భారీగా సాగు జరిగిందన్నది అవాస్తవమన్నారు.
ఇది కూడా చదవండి: Job: వావ్.. ఉద్యోగం పోగొట్టుకున్న తర్వాత కూడా ప్రభుత్వం జీతం చెల్లిస్తుంది!
కాళేశ్వరం ద్వారా అనేక చెరువులు, చెక్ డ్యామ్‌లను నింపామని, కాళేశ్వరం ద్వారా 20 లక్షల 33 వేల ఎకరాలకు నీళ్లు అందించామని వివరించారు. దీనిపై కాంగ్రెస్ నేతలు అనేక రకాలుగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 2007లో ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారని, నాలుగేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని అప్పట్లో కాంగ్రెస్ చెప్పింది.. కానీ 8 ఏళ్లలో ప్రాజెక్ట్‌కు అనుమతులు కూడా తీసుకురాలేదని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Telangana: కొత్త నేతలతో పాత నేతల లొల్లి.. సీఎం రేవంత్ ఇంటికి మీనాక్షి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








