రాముడి కార్యం పై రాజకీయం చెయ్యొద్దు.. దొంగ పుస్తకాలతో విరాళాలు వసూలు చేస్తున్నారన్న వార్తల్లోవాస్తవం లేదు..
అధికార పార్టీ నాయకులు గుండాల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు బీజేపీ నాయకులు. హన్మకొండ బీజేపీ కార్యాలయంలో నేడు బీజేపీ నాయకుల ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. రాకేష్ రెడ్డి, బీజేపీ అధికార ప్రతినిధి,
అధికార పార్టీ నాయకులు గుండాల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు బీజేపీ నాయకులు. హన్మకొండ లోని బీజేపీ కార్యాలయానికి పెద్ద మొత్తంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. దాంతో బీజేపీ పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కాగా హన్మకొండ బీజేపీ కార్యాలయంలో బీజేపీ నాయకుల మీడియాతో మాట్లాడారు. రాకేష్ రెడ్డి, బీజేపీ అధికార ప్రతినిధి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. శ్రీ రాముడి కార్యం పై రాజకీయం చేయొద్దని అన్నారు. అలాగే దొంగ పుస్తకాలతో విరాళాలు వసూలు చేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలో వాస్తవం లేదని అన్నారు. దొంగ పుస్తకాలతో వసూలు చేశామని దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు. టీఆర్ఎస్ కార్యకర్తలు గూండాల్లా వ్యవహరిస్తున్నారని, మా కార్యాలయంలో లైట్లు ఆపేసి దాడి చేశారని అన్నారు. బీజేపీ కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు. పోలీసులు టీఆర్ఎస్‌కు సహకరిస్తున్నారని ఆరోపించారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
రెండు పార్టీల బాహాబాహీతో ఓరుగల్లులో టెన్షన్.. టెన్షన్.. ప్రశాంతంగా కొనసాగుతున్న పరకాల బంద్