Gundrampally: నిజాం రజాకార్లకు ఎదురొడ్డి నిలిచిన నేల గుండ్రాంపల్లి.. నెత్తురు చిమ్మినా వెనకడుగు వేయని గ్రామం..

నిజాం అండతో చెలరేగిన రజాకార్లు సృష్టించిన మారణహోమానికి ఒక సజీవ సాక్ష్యం నల్లగొండ జిల్లాలోని గుండ్రాంపల్లి గ్రామం. రజాకార్ల దురాగాతాలను అడ్డుకునేందుకు రక్తం చిమ్మించింది ఈ గ్రామం.

Gundrampally: నిజాం రజాకార్లకు ఎదురొడ్డి నిలిచిన నేల గుండ్రాంపల్లి.. నెత్తురు చిమ్మినా వెనకడుగు వేయని గ్రామం..
Gundrampally
Follow us
Shaik Madar Saheb

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 14, 2022 | 2:33 PM

Telangana Freedom Fight: సెప్టెంబర్‌ 17- తెలంగాణ చరిత్రలో ఒక చిరస్మరణీయ రోజు. నైజాం పాలన నుంచి విముక్తి పొంది హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో భాగమైన రోజు. ఆ రోజు ఆషామాషీగా రాలేదు. ఆ శుభ గడియకు ముందో జనాలు ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్నారు. ఆ కష్టాలు, బాధలను మ మాటల్లో వర్ణించలేం. నిజాం అండతో చెలరేగిన రజాకార్లు సృష్టించిన మారణహోమానికి ఒక సజీవ సాక్ష్యం నల్లగొండ జిల్లాలోని గుండ్రాంపల్లి గ్రామం. రజాకార్ల దురాగాతాలను అడ్డుకునేందుకు రక్తం చిమ్మించింది ఈ గ్రామం. తెలంగాణ ప్రజల విముక్తి పోరాటంలో తనకంటూ ప్రత్యేక స్థానం పొందిన గుండ్రంపల్లిపై టీవీ9 స్పెషల్ స్టోరీ.

నిజామ్‌ పాలనలో చోటుచేసుకున్న అకృత్యాలకు సజీన సాక్ష్యం ఈ మసీదు. ఈ మసీదు సాక్షిగా వందల మందిని ఊచకోత కోశారు నాటి రజాకార్లు. నిజాంకు వ్యతిరేకంగా మొదలైన తెలంగాణ సాయుధ పోరాటంలో నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లికి ప్రత్యేక స్థానం ఉంది. హైదరాబాద్‌ విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్‌ దాటిన తర్వాత ఉంటుంది ఈ గ్రామం.

గుండ్రాంపల్లి మసీదు కేంద్రంగా నిజాం పాలకులు ఏర్పాటు చేసిన రజాకార్ల లైసెన్స్ కిల్లర్ ఖాసిం రజ్వీ ఆగడాలు కొనసాగించారు. ఇప్పటి సూర్యాపేట జిల్లా వర్ధమానుకోటకు చెందిన సయ్యద్‌ మక్బుల్ జీవనోపాధికి గుండ్రాంపల్లికి వచ్చి నాటి మజ్లిస్‌ సంస్థలో చేరి దళ నాయకుడిగా ఎదిగాడు. 50 మందితో దళాన్ని ఏర్పాటు చేసుకొని ఖాసీం రజ్వీకి అనుచరుడయ్యాడు. ఈ మసీదును కేంద్రంగా మక్బుల్ ఈ ప్రాంతంలో చేసిన దోపిడీలు, దౌర్జన్యాలు, మహిళలపై అత్యాచారాలకు లెక్కే లేదు. తన ఆగడాలకు అడ్డుగా వచ్చే వారిని నిర్దాక్షిణ్యంగా నరికి చంపేవాడు. ఇద్దరు గర్భిణీలను చంపి తన ఇంటి పునాదిలో నిర్మించుకున్న కర్కశకుడు.

ఇవి కూడా చదవండి

అప్పట్లో కమ్యూనిస్టు దళాలు, రజాకార్లకు నిత్యం ఘర్షణలు జరుగుతుండేవి. మక్బూల్ ఇంటిపై కమ్యూనిస్టు దళాలు చేసిన దాడిలో మక్బూల్ భార్య, కూతురు చనిపోయారు. దీంతో ప్రతికారేచ్చతో మక్బూల్ రగిలిపోయాడు. కమ్యూనిస్టు దళసభ్యులు, ఇతరులను 350 మందికి పైగా ఊచకోత కోసి మసీదు పక్కన ఉన్న వ్యవసాయ బావిలో పడేసి తన రాక్షసతత్వాన్ని చాటుకున్నాడు. మక్బూల్ ఆకృత్యాలు అరాచకాలకు అంతులేదని, గ్రామానికి చెందిన 350 మందికి పైగా బలయ్యారని అప్పటి సమరయోధులు గుర్తు చేస్తున్నారు.

నాటి అమరవీరులను స్మరించుకుంటూ 1993లో కమ్యూనిస్టులు, గ్రామస్తులు గుండ్రంపల్లిలో స్మారక స్థూపాన్ని నిర్మించుకున్నారు. ఇటీవల 65వ నెంబర్ జాతీయ రహదారి విస్తరణలో అమరవీరుల స్తూపాన్ని తొలగించారు. దీంతో గ్రామస్తులు మరో ప్రదేశంలో అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఏటా అమరవీరుల త్యాగాలు గుర్తు చేసుకుంటారు గ్రామస్తులు. తెలంగాణ సాయుధ పోరాటంలో గుండ్రాంపల్లి చరిత్రను భావితరాలకు అందజేసేందుకు పుస్తకాలు ముద్రిస్తున్నామని స్థానికులు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం