Arvind Kejriwal: కాంగ్రెస్ కథ ముగిసింది.. వారి గురించి అడగొద్దు.. అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు..
గుజరాత్ ప్రచారంలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం పారిశుద్ధ్య కార్మికులతో టౌన్ హాల్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన కేజ్రీవాల్..
Arvind Kejriwal slams Congress: గుజరాత్ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పీడ్ పెంచారు. గుజరాత్‌లో రెండు రోజులపాటు పర్యటిస్తున్న కేజ్రీవాల్.. ప్రజలకు పలు వాగ్ధానాలు చేస్తున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అవినీతికి తావులేకుండా పాలన అందిస్తామని.. సమస్యలు పరిష్కరిస్తామని హామీలిస్తున్నారు. గుజరాత్ ప్రచారంలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం పారిశుద్ధ్య కార్మికులతో టౌన్ హాల్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన కేజ్రీవాల్.. కాంగ్రెస్ పార్టీ గురించి ప్రశ్నించగా.. ఎప్పటిలానే విమర్శలు గుప్పించారు. దేశంలో కాంగ్రెస్ పని అయిపోయిందంటూ చెప్పకనే చెప్పారు. కాంగ్రెస్ గురించి ఓ రిపోర్టర్ ప్రశ్నించగా.. “కాంగ్రెస్ కథ ముగిసింది. వారికి సంబంధించి ప్రశ్నలను తీసుకోవడం ఆపండి. ఎవరూ పట్టించుకోవడం లేదు” అంటూ అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా బీజేపీపై కూడా ఆగ్రహం వ్యక్తంచేశారు. “ప్రధాని మోడీ తర్వాత సోనియా గాంధీని ప్రధానమంత్రిని బ్యాక్‌డోర్ ద్వారా చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది’’ అంటూ కేజ్రీవాల్ అధికార బిజెపిని విమర్శించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్‌లోని అన్ని స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ఢిల్లీ సీఎం స్పష్టం చచేశారు. ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే గుజరాత్ ప్రజలకు అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఈ ఏడాది చివర్లో లేదా.. వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లో తమ పార్టీ అధికారంలోకి వస్తే, తమ పార్టీ ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర పార్టీలకు చెందిన శాసనసభ్యులు, ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడకుండా చూస్తామని ప్రకటించారు. ఇలా పట్టుబడితే జైలు శిక్ష విధించేలా చేస్తామని పేర్కొన్నారు.
కాగా, పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం గుజరాత్ దివాలా అంచున ఉందని.. ఉద్యోగుల జీతాలకు కూడా డబ్బులు లేవని, గుజరాత్ కోసం యాడ్స్ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీనిపై స్పందించాలని ఒక విలేకరి ఆయనను కోరగా.. ఈ విధంగా కేజ్రీవాల్ సమాధానమిచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి