BHEL Recruitment 2022: ఇంజనీరింగ్ నిరుద్యోగులకు బంపరాఫర్! భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌లో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షన్నర జీతం..
భారత ప్రభుత్వానికి చెందిన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL).. 150 ఇంజనీర్ ట్రైనీ, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల (Engineer Trainee & Executive Trainee posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల..
BHEL Engineer & Executive Trainee Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL).. 150 ఇంజనీర్ ట్రైనీ, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల (Engineer Trainee & Executive Trainee posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి మెకానికల్/ఎలక్ట్రికల్/సివిల్/కెమికల్ విభాగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ, సంబంధిత స్పెషలైజేషన్లో బ్యాచిలర్స్ డిగ్రీ/పీజీ డిగ్రీ/డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సెప్టెంబర్ 1, 2022వ తేదీ నాటికి అభ్యర్ధుల వయసు 29 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 4, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్ధులు రూ.300లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అక్టోబర్ 31, నవంబర్ 1, 2 తేదీల్లో రాత పరీక్ష నిర్వహిస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ50,000ల నుంచి రూ.1,80,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు..
- మెకానికల్ పోస్టులు: 30
- ఎలక్ట్రికల్ పోస్టులు: 15
- సివిల్ పోస్టులు: 40
- కెమికల్ పోస్టులు: 10
- HR పోస్టులు: 10
- ఫైనాన్స్ పోస్టులు: 20
- IT/కంప్యూటర్ సైన్స్ పోస్టులు: 20
- మెటలర్జీ ఇంజినీర్ పోస్టులు: 5
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.