Crime News: దారుణం.. స్కూల్ బస్‌లోనే చిన్నారిపై డ్రైవర్ అత్యాచారం.. అనంతరం డ్రెస్ మార్చి..

వాహనంలోనే డ్రైవర్ ఈ దారుణానికి పాల్పడి డ్రెస్ మార్చి ఇంటి దగ్గర వదిలేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. గత గురువారం ఈ సంఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Crime News: దారుణం.. స్కూల్ బస్‌లోనే చిన్నారిపై డ్రైవర్ అత్యాచారం.. అనంతరం డ్రెస్ మార్చి..
Rape Case
Follow us

|

Updated on: Sep 13, 2022 | 4:11 PM

Bhopal Nursery Student Rape Case: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మూడున్నరేళ్ల నర్సరీ విద్యార్థినిపై స్కూల్ బస్సు డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వాహనంలోనే డ్రైవర్ ఈ దారుణానికి పాల్పడి డ్రెస్ మార్చి ఇంటి దగ్గర వదిలేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. గత గురువారం ఈ సంఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్, మహిళా అటెండర్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారి డ్రెస్ మార్చుకొని ఉండటం, అనారోగ్యానికి గురవ్వడంతో అస‌లు విష‌యం వెలుగుచూసింది. ఈ దారుణం గురించి ముందుగా తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేయగా.. వారు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు పేర్కొంటున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో మహిళా అటెండర్ కూడా ఉందని పోలీసులు తెలిపారు.

నగరంలోని ఓ ప్రముఖ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న చిన్నారి బస్సులో ఇంటికి తిరిగి వస్తుండగా ఈ దారుణం జరిగింది. బాలిక ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తన బ్యాగ్‌లో ఉంచిన స్పేర్ సెట్‌తో ఎవరో పిల్లల బట్టలు మార్చినట్లు ఆమె తల్లి గమనించిందని అధికారి తెలిపారు. ఆ తర్వాత తల్లి తన కూతురి క్లాస్ టీచర్‌తో పాటు స్కూల్ ప్రిన్సిపాల్‌ని ఈ విషయంపై సంప్రదించగా.. బాలిక దుస్తులు మార్చలేదని వారు పేర్కొన్నారు. ఆ తర్వాత ఆ చిన్నారి తన జననాంగంలో నొప్పిగా ఉందని ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఏమైందని చిన్నారిని ఆరాతీశారు. బస్సు డ్రైవర్ తనను లైంగికంగా వేధించాడని, దుస్తులు కూడా మార్చాడని తెలియజేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.

తల్లిదండ్రులు మరుసటి రోజు పాఠశాలకు వెళ్లి అధికారులకు ఫిర్యాదు చేయగా.. చిన్నారి డ్రైవర్‌ను గుర్తించినట్లు అధికారి తెలిపారు. బాలిక తల్లిదండ్రులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) నిధి సక్సేనా తెలిపారు. ఘటన సమయంలో, బస్సులో ఒక మహిళా అటెండర్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. పోక్సో చట్టం, తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో కచ్చితమైన స్థలాన్ని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆమె తెలిపారు.

ఇవి కూడా చదవండి

కాగా.. ఈ ఘటన అనంతరం పలు పార్టీల నేతలు శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితులిద్దరినీ అరెస్టు చేసినట్లు మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. పాఠశాల యాజమాన్యం ఈ విషయాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తుందా అని అడిగిన ప్రశ్నకు మంత్రి మాట్లాడుతూ.. స్కూల్ అడ్మినిస్ట్రేషన్ పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నామన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రిజర్వేషన్లపై ఆర్ఎస్‌ఎస్ చీఫ్‌ మోహన్‌ భగవత్ కీలక వ్యాఖ్యలు
రిజర్వేషన్లపై ఆర్ఎస్‌ఎస్ చీఫ్‌ మోహన్‌ భగవత్ కీలక వ్యాఖ్యలు
6 అర్థ శతకాలు.. 6సార్లు ఓడిన ముంబై ఇండియన్స్.. తిలక్‌పై ట్రోల్స్
6 అర్థ శతకాలు.. 6సార్లు ఓడిన ముంబై ఇండియన్స్.. తిలక్‌పై ట్రోల్స్
పాటల్లేని విజయ్ సినిమా.. 75 కోట్లు వసూలు చేసిన కేరళలో మూడో సినిమా
పాటల్లేని విజయ్ సినిమా.. 75 కోట్లు వసూలు చేసిన కేరళలో మూడో సినిమా
గతేడాది ఐటీఆర్ దాఖలు చేయని వారికి ఇంకా అవకాశం ఉందా?
గతేడాది ఐటీఆర్ దాఖలు చేయని వారికి ఇంకా అవకాశం ఉందా?
బాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే: సీఎం జగన్
బాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే: సీఎం జగన్
అణు యుద్ధాన్ని తట్టుకునేలా విమానం.. ప్రత్యేకతలు ఇవే!
అణు యుద్ధాన్ని తట్టుకునేలా విమానం.. ప్రత్యేకతలు ఇవే!
పురుషులకు వరం ఈ గింజలు.. తిన్నారంటే ఆ సమస్యలే ఉండవట..
పురుషులకు వరం ఈ గింజలు.. తిన్నారంటే ఆ సమస్యలే ఉండవట..
మండే ఎండల్లో బయటకు వెళ్లేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి
మండే ఎండల్లో బయటకు వెళ్లేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి
అలాంటి సీన్స్‌లో అస్సలు నటించను.. కారణం ఇదే అంటున్న మృణాల్..
అలాంటి సీన్స్‌లో అస్సలు నటించను.. కారణం ఇదే అంటున్న మృణాల్..
రాలి పోయిన జట్టుతో కూడా జేబు నింపుకోవచ్చు.. ఎలాగంటే!
రాలి పోయిన జట్టుతో కూడా జేబు నింపుకోవచ్చు.. ఎలాగంటే!