Grenade bomb in Mahabubnagar : మహబూబ్‌నగర్ జిల్లాలో గ్రనేడ్ బాంబు కలకలం, హడలిపోతోన్న స్థానికులు..టీవీ9 సాహసోపేత కవరేజ్
Grenade bomb in Mahabubnagar : మహబూబ్‌నగర్ జిల్లాలో గ్రనేడ్ బాంబు ఒక్కసారిగా కలకలం రేపింది. మహబూబ్ నగర్ పట్టణానికి కూతవేటు దూరంలోని గుట్టలల్లో ఓ పెద్ద గ్రనేడ్ కనిపించింది. ఉదయం పశువులు..
Grenade bomb in Mahabubnagar : మహబూబ్‌నగర్ జిల్లాలో గ్రనేడ్ బాంబు ఒక్కసారిగా కలకలం రేపింది. మహబూబ్ నగర్ పట్టణానికి కూతవేటు దూరంలోని గుట్టలల్లో ఓ పెద్ద గ్రనేడ్ కనిపించింది. ఉదయం పశువులు మేపేందుకువచ్చిన వారికి గ్రనేడ్ కనిపించడంతో స్థానిక సర్పంచ్ కు సమాచారం అందించారు. ఈ ప్రాంతంలో కి గ్రనేడ్ ఎలా వచ్చింది. ఇలాంటివి ఇంకా ఈ ప్రాంతంలో ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ క్రమంలో టీవీ9 సాహసోపేతంగా వ్యవహరించి గ్రనేడ్ దృశ్యాలను చిత్రీకరించి, అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో అధికారులు హుటాహుటీన రంగంలోకి దిగారు. అయితే, స్థానికులు మాత్రం గ్రనేడ్ ఎక్కడ పేలుతుందో, స్థానికంగా ఇంకెక్కడయినా బాంబులు ఉన్నాయేమోనని హడలి పోతున్నారు.