AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana News: ఛీ.. పురుగులు పట్టి పోతావ్ రా.. అల్లారుముద్దుగా పెంచిన అమ్మమ్మనే..

డ్రగ్స్‌, మద్యం, మత్తు పదార్థాలకు బానిసలై యూత్‌ తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. మరికొందరు వీటి మత్తులో కన్నవారిని, కట్టుకున్నవారినే కడతేర్చుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది. గంజాయికి బానిసైన ఓ యువకుడు ఏకంగా చిన్నప్పటి నుంచి తనను అల్లారు ముద్దుగా పెంచిన అమ్మమ్మనే హతమార్చాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Telangana News: ఛీ.. పురుగులు పట్టి పోతావ్ రా.. అల్లారుముద్దుగా పెంచిన అమ్మమ్మనే..
Khammam News
N Narayana Rao
| Edited By: |

Updated on: Oct 03, 2025 | 5:39 PM

Share

డ్రగ్స్‌, మద్యం, మత్తు పదార్థాలకు బానిసలై యూత్‌ తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. మరికొందరు వీటి మత్తులో కన్నవారిని, కట్టుకున్నవారినే కడతేర్చుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది. గంజాయికి బానిసైన ఓ యువకుడు ఏకంగా చిన్నప్పటి నుంచి తనను అల్లారు ముద్దుగా పెంచిన అమ్మమ్మనే హతమార్చాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపినక వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం సకునవీడు గ్రామానికి చెందిన సాయి అనే యువకుడు తన చిన్న వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. దీంతో అతన్ని తన అమ్మమ్మ అయిన శాఖమూరి పద్మ పెంచి పెద్దచేసింది. అయితే చదువుకొని బాగు పడాల్సింది పోయి సాయి జులాయిగా తిరుగుతూ చెడు అలవాట్లు నేర్చుకున్నాడు. ఈ క్రమంలోనే గంజాయి, మత్తు పదార్థాలకు బానిసయ్యాడు.

అయితే ఇటీవల ఇంటికొచ్చిన సాయి మత్తులో తనను పెంచి పెద్ద చేసిన అమ్మమ్మనే కిరాతకంగా మత్య చేశాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.

అయితే గంజాయి మత్తులో మనవడే ఈ హత్యకు పాల్పడ్డట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో కొందరు యువకులు గంజాయిని విచ్చలవిడిగా సేవిస్తున్నారని వారిపై పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తండ్రికొడుకుల ప్రాణం తీసిన వేగం..కారుతో ఢీకొట్టి పరారైన బౌన్సర్లు
తండ్రికొడుకుల ప్రాణం తీసిన వేగం..కారుతో ఢీకొట్టి పరారైన బౌన్సర్లు
కాశ్మీర్‎లా మారిన ఊటీ..టూర్‎కి రైట్ టైం.. మిస్ కావద్దు..
కాశ్మీర్‎లా మారిన ఊటీ..టూర్‎కి రైట్ టైం.. మిస్ కావద్దు..
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?