Telangana: పనికో రేటు.. తనకు ఆన్‌లైన్‌ పేమెంట్లూ ఓకే అంటున్న లంచగొండి ఏఈఓ

అధికారులు అవినీతికి పాల్పడడం విన్నాం. చాటుమాటుగా లంచాలు తీసుకుని పనులు చేయడమూ చూశాం.. కానీ ఈ అధికారి అంతకు మించి.

Telangana: పనికో రేటు.. తనకు ఆన్‌లైన్‌ పేమెంట్లూ ఓకే అంటున్న లంచగొండి ఏఈఓ
Corruption
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 04, 2022 | 8:04 AM

Rajanna Sircilla district: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ అవినీతి అధికారి బాగోతం వింటే అవాక్కవ్వాల్సిందే. తంగళ్లపల్లి మండలం(thangallapally mandal)  తాడూర్(Thadur) ఏఈవో పేరు అజీజ్‌ ఖాన్‌. రైతులకు ఏ పనిచేయాలన్నా.. లంచం ఇచ్చుకోవాల్సిందే. రైతుబీమా, రైతుబంధు, పంట వివరాల నమోదు.. ఇలా ఒక్కో పనికి ఒక్కో రేటు ఫిక్స్‌చేసి మరీ రైతులను పీల్చిపిప్పిచేస్తున్నాడు. డబ్బులిస్తే తప్ప పని జరగదంటూ తెగేసి చెబుతున్నాడు. అందుకు ఆన్‌లైన్‌ పేమెంట్లూ యాక్సెప్టబుల్‌ అంటున్నాడు. దిగువన వీడియోలో మీరు చూడవచ్చు.. ఆ అధికారి ఏమాత్రం జంకూబొంకు లేకుండా లంచం ఎలా డిమాండ్‌ చేస్తున్నాడో. ఓ రైతు తనపంటను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు అజీజ్‌ఖాన్‌ను కలిశాడు. అందుకు ఏఈవో 500 రూపాయలు లంచం అడిగాడు. కంగుతిన్న రైతు.. ఇదెక్కడి అన్యాయం సార్‌.. డబ్బు ఎందుకివ్వాలంటూ అమాయకంగా అడిగాడు. డబ్బు ఇస్తేనే పని.. లేదంటే లేదని ఖరాఖండిగా చెప్పడంతో చేసేదేమీలేక పోన్‌పే ద్వారా ఆన్‌లైన్‌లో పంపించాడు. రైతు సెల్‌ఫోన్‌లో వీడియో తీయడంతో అజీజ్‌ఖాన్‌ బాగోతం బయటపడింది. ఏఈవోపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాడు బాధిత రైతు.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే