AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adulterated Milk: తెల్లనివన్నీ పాలు కాదండోయ్.. ఈ మ్యాటర్ తెలిస్తే గుండెలదిరిపోవడం ఖాయం..

Adulterated Milk: కల్తీ.. కల్తీ.. కల్తీ.. కాదేదీ కల్తీకి అనర్హం అంటూ.. ప్రతీది కల్తీ చేసేస్తున్నారు కొందరు దురాశాపరులు. పిల్లలు తాగే పాలనూ కల్తీచేస్తూ సొమ్ముచేసుకుంటున్నారు కేటుగాళ్లు.

Adulterated Milk: తెల్లనివన్నీ పాలు కాదండోయ్.. ఈ మ్యాటర్ తెలిస్తే గుండెలదిరిపోవడం ఖాయం..
Milk
Shiva Prajapati
|

Updated on: Jun 04, 2022 | 8:42 AM

Share

Adulterated Milk: కల్తీ.. కల్తీ.. కల్తీ.. కాదేదీ కల్తీకి అనర్హం అంటూ.. ప్రతీది కల్తీ చేసేస్తున్నారు కొందరు దురాశాపరులు. పిల్లలు తాగే పాలనూ కల్తీచేస్తూ సొమ్ముచేసుకుంటున్నారు కేటుగాళ్లు. తాజాగా కల్తీ పాలను విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. హైదరాబాద్ నగర శివార్లలో తనిఖీలు చేసి.. వారందరినీ అదుపులోకి తసుకున్నారు. వివరాల్లోకెళితే.. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో కల్తీపాల దందాపై స్థానికుల ఫిర్యాదుతో అధికారులు తనిఖీలు చేపట్టారు. డివిజన్‌ వ్యాప్తంగా పాల ఉత్పత్తిదారుల ఇళ్లల్లో తనిఖీలు చేశారు. పదిమంది నుంచి పాల శాంపిళ్లను సేకరించి హైదరాబాద్‌ ల్యాబ్‌కు పంపారు. పాలు నిల్వ ఉంచడానికి హానికరమైన కెమికల్స్‌ వాడుతున్నట్లు గుర్తించారు. ల్యాబ్‌ నివేదిక ప్రకారం పాల ఉత్పత్తిదారులపై కేసునమోదు చేస్తామని తెలిపారు ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ జ్యోతిర్మయి.

విడిపాలలో హానికర కెమికల్స్‌ కలిపే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు జ్యోతిర్మయి. వినియోగదారులు బ్రాండెడ్‌ పాలనే కొనుగోలు చేయాలని కోరారు. అనుమతిలేకుండా పాలను నిల్వ ఉంచడం నేరమేనన్నారు. పాలు విక్రయించేవారు కచ్చితంగా ఫుడ్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలంటున్నారు. లేకుంటే క్రిమినల్‌ కేసులు పెడతామని హెచ్చరించారు. ల్యాబ్‌ నివేదిక వస్తే తప్ప కల్తీ ఏమేరకు జరిగిందో చెప్పలేమంటున్నారు అదికారులు.

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ