అసలైన పక్షి రాజు.. ఈ రాంబాబు మాస్టారు.. పిచ్చుకలు అంటే ఎంత ప్రేమో..!
విశ్వంలో ఎన్నో కోట్ల జీవరాశులు జీవిస్తున్నాయి. యుగాలు గడుస్తున్న కొద్ది కొన్ని ప్రాణులు అంతరించిపోతున్నాయి. పర్యావరణ కాలుష్యం కారణంగా ప్రకృతి సహజ సిద్దాన్ని కోల్పోయి వాతావరణంలో ఎన్నో మార్పులకు గురవుతూ, ఎన్నో విపత్తులకు దారితీస్తుంది. అదేవిధంగా చిన్న చిన్న ప్రాణులైన పిచ్చుకలు కూడా రేడియేషన్ కారణంగా అంతరించి పోతున్నాయి.

విశ్వంలో ఎన్నో కోట్ల జీవరాశులు జీవిస్తున్నాయి. యుగాలు గడుస్తున్న కొద్ది కొన్ని ప్రాణులు అంతరించిపోతున్నాయి. పర్యావరణ కాలుష్యం కారణంగా ప్రకృతి సహజ సిద్దాన్ని కోల్పోయి వాతావరణంలో ఎన్నో మార్పులకు గురవుతూ, ఎన్నో విపత్తులకు దారితీస్తుంది. అదేవిధంగా చిన్న చిన్న ప్రాణులైన పిచ్చుకలు కూడా రేడియేషన్ కారణంగా అంతరించి పోతున్నాయి. ఎంతలా అంటే.. రాబోయే తరాలకు పిచ్చుకలు ఇలా ఉంటాయి అని పుస్తకాల్లో మాత్రమే చూపించాల్సిన పరిస్థితి.
అలాంటి పక్షులను బాధ్యతగా భావించి, రక్షిస్తూ వాటికి పంచ భూతాల నుంచి కాపాడే విధంగా కృత్రిమ గూడు లు ఏర్పాటు చేసి.. చిరు ధాన్యాలను ఆహారంగా పెడుతూ.. పక్షులను కంటికి రెప్పలా సంరక్షిస్తున్న ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన అకూటి రాంబాబు. వేంసూరు ప్రభుత్వ హైస్కూల్‌లో అకూటి రాంబాబు బయాలజీ ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నాడు. అయితే రాంబాబు మాస్టారుకు చిన్నతనం నుంచి కూడా నేచర్ తో స్నేహం చెయ్యడం అంటే చాలా ఇష్టం. ప్రకృతిలో సహజసిద్ధంగా దొరికే పండ్లు, మొక్కలు, వాగులు వంకలు, అంటే చాలా ఇష్టం.
అదేవిధంగా తన చిన్నతనంలో వాళ్ళది తాటాకుల ఇల్లు కావడంతో బోలెడన్ని పిచ్చుకలు గూడు కట్టుకుని ఉండేవట. ఆ పిచ్చుకలు చూస్తూ సంతోషంగా గడిపేవాడు. కొన్నేళ్ల తర్వాత పూరి గుడిసెలు పోయి డాబాలు, భవంతులు వచ్చేశాయి. మరోవైపు సెల్ ఫోన్లు,సెల్ టవర్లు కారణంగా రేడియేషన్ విపరీతంగా పెరిగి పక్షులు అంతరించి పోతున్నాయి. తన చిన్నతనంలో పిచ్చుకలను చూసి మురిపోయిన రాంబాబు ఎలాగైనా తన వంతు బాధ్యతగా పిచ్చుకలను కాపాడుకోవాలని నిర్ణయించుకున్నాడు. సత్తుపల్లిలో తాను సొంతంగా నిర్మించుకున్న బిల్డింగ్ లో పిచ్చుకల కోసం కృత్రిమంగా తయారు చేసిన గూడు లను ఏర్పాటు చేశాడు.
ప్లాస్టిక్ పైపులను, వాటర్ బాటిళ్లను ఉపయోగించి పక్షుల కోసం కృత్రిమ గూడు లు ఏర్పాటు చేశాడు. ఎండలు, వానలు,ఈదురు గాలుల నుంచి రక్షించేలా గూడులను నిర్మించాడు. అంతేకాకుండా పక్షులకు ఆహారం కోసం తన జీతంలో నుంచి కొంత డబ్బును ఖర్చు చేస్తూ…ప్రతి రోజూ చిరు ధాన్యాలను ఆహారంగా పెడుతుంటాడు. తనతో పాటు తన పిల్లలకు కూడా నేచురల్ ను దగ్గరగా చేస్తూ పక్షులంటే ఇష్ట పడేలా పిల్లలకు కూడా పక్షులను సంరక్షించడం బాధ్యతగా అలవాటు చేశాడు.
ప్రకృతి, పక్షులు అంటే ఇష్టం ఉండటంతో జీవశాస్త్రాన్ని ఎంచుకొని జంతుశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి బయాలజీ సైన్స్ లో B.ed కూడా చదివాడు. 2012 లో DSC ద్వారా స్కూల్ అసిస్టెంట్ గా బయాలజీ టీచర్ ఉద్యోగం సాధించాడు. తనలాగానే స్టూడెంట్స్ లోను ప్రకృతి మీద ఇష్టం పెరిగేలా…మొక్కల గురించి, జంతువుల గురించి పూర్తి అవగాహన కలిగించేలా ఏకంగా బయాలజీ మ్యూజియం ఏర్పాటు చేసి స్టూడెంట్స్ హార్ట్ కి టచ్ అయ్యేలా సైన్స్ పాఠాలు బోధిస్తున్నాడు. కళ్ళతో చూసి టీచర్ బోధించే పాఠాలు వింటే విద్యార్ధుల మైండ్ లో గుర్తుండి పోతాయని బయాలజీ టీచర్ రాంబాబు అంటున్నారు.
రజనీకాంత్ నటించిన రోబో 2.O సినిమాలో మాదిరి పక్షులను అపురూపంగా చూసుకునే పక్షి రాజు గురించి మనందరికీ తెలుసు. అదేవిధంగా బయాలజీ టీచర్ గా పనిచేస్తున్న రాంబాబు మాస్టారు కూడా ఒక పక్షి రాజు అని ఖమ్మం జిల్లా ప్రజలు అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఒక ప్రభుత్వ బయాలజీ టీచర్ గా పనిచేస్తున్న రాంబాబు మాస్టారు కు తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ బోర్డు నుంచి రాష్ట్ర స్థాయి అవార్డు కూడా వచ్చింది. అదేవిధంగా జిల్లా విద్యాశాఖ నుంచి కూడా ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాడు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..