Telangana: రూ.15 కోట్లు మాయం చేసిన ప్రభుత్వ అధికారి.. విచారణలో విస్తుపోయే వాస్తవాలు!

ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిస అయిన మిషన్ భగీరథ ఏఈ రాహుల్ ఏకంగా రూ.15 కోట్లు అప్పు చేసి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించి ఢిల్లీ విమానాశ్రయంలో పట్టుబడ్డాడు. గ్రామపంచాయతీ బ్యాంక్ అకౌంట్ నుండి ఏకంగా బెట్టింగులకు పాల్పడ్డాడు ఏఈ రాహుల్. ప్రభుత్వ బ్యాంక్ అకౌంట్ ను తన ఆధీనంలో పెట్టుకొని ఆన్‌లైన్ బెట్టింగులకు పాల్పడి ఏకంగా 15 కోట్ల రూపాయలను మాయం చేశాడు.

Telangana: రూ.15 కోట్లు మాయం చేసిన ప్రభుత్వ అధికారి.. విచారణలో విస్తుపోయే వాస్తవాలు!
Online Betting
Follow us
Peddaprolu Jyothi

| Edited By: Balaraju Goud

Updated on: Mar 12, 2024 | 11:55 AM

ఓ ప్రభుత్వ అధికారి ఏకంగా 15 కోట్ల రూపాయలను మాయం చేశాడు. కాంట్రాక్టర్లకు పనులు ఇప్పిస్తానని నమ్మబలికి ఏకంగా కోట్ల రూపాయలను కొల్లగొట్టాడు. జులై 11న కీసరగుట్ట పోలీస్ స్టేషన్‌లో బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఎనిమిది నెలల నుండి అజ్ఞాతంలో ఉన్న మిషన్ భగీరథ ఏఈ రాహుల్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఈ విచారణలో భాగంగా రాహుల్ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి…

ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిస అయిన మిషన్ భగీరథ ఏఈ రాహుల్ ఏకంగా రూ.15 కోట్లు అప్పు చేసి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించి ఢిల్లీ విమానాశ్రయంలో పట్టుబడ్డాడు. ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటు పడ్డ రాహుల్ మొదట వేల రూపాయలు బెట్టింగ్‌‌లో పెట్టి డబ్బులు రావడంతో లక్షల రూపాయలు బెట్టింగ్ లో పెట్టాడు. ఆ తరువాత అది కాస్త కోట్ల రూపాయలకు బెట్టింగ్ లో పెట్టడానికి దారి తీసింది. అయితే అదే సమయంలో కొంతమంది కాంట్రాక్టర్లను నమ్మించి వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులను తీసుకున్నాడు. విషయం కాస్త ఉన్నతాధికారులకు చేరడంతో అతని సస్పెండ్ చేశారు. అంతేకాకుండా రాహుల్‌కు సహకరించిన అదే శాఖలోని ఇద్దరు మహిళలపై కూడా వేటు వేశారు అధికారులు.

గతంలో నాగారం గ్రామపంచాయతీ ఉన్న సమయంలో ఎస్‌బీఐ బ్యాంక్ అకౌంట్‌ను దుర్వినియోగం చేసిన రాహుల్ కాంట్రాక్టర్లను ప్రభుత్వ బ్యాంక్ అకౌంట్ అని నమ్మించి కోట్ల రూపాయలను ఆ ఎకౌంట్‌లో జమ చేయించేలా చేశాడు. అయితే 2019 లో గ్రామపంచాయతీ నుండి నాగారం మున్సిపల్‌గా మారింది. అప్పటి గ్రామపంచాయతీకి అధికారులు వాడిన బ్యాంక్ అకౌంట్‌ను ఉప్పల్‌లోని ఎస్‌బీఐ బ్రాంచ్‌కు చెందిన మేనేజర్‌తో సహా రాహుల్ వద్ద పనిచేసే శ్రీవాణి , సాయి ధరణిల సహకారంతో 2023 జనవరిలో కేవైసీ ను చేయించాడు. గ్రామపంచాయతీ బ్యాంక్ అకౌంట్ నుండి ఏకంగా బెట్టింగులకు పాల్పడ్డాడు ఏఈ రాహుల్. ప్రభుత్వ బ్యాంక్ అకౌంట్ ను తన ఆధీనంలో పెట్టుకొని ఆన్‌లైన్ బెట్టింగులకు పాల్పడి ఏకంగా 15 కోట్ల రూపాయలను మాయం చేశాడు. ప్రస్తుతం బాధితులు కీసర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయాన్ని బయటపడింది. సుమారుగా 37 మంది పైగా కాంట్రాక్టర్లు డబ్బులు జమ చేసి మోసపోయినట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో శ్రీ వాణి, సాయి ధరణి పరారీలో ఉన్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..