Cable Bridge: హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్.. మరో కేబుల్ బ్రిడ్జి రెడీ, ఎక్కడంటే
హైదరాబాద్ మరో కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. చింతల్ మెట్ రోడ్డును బెంగళూరు జాతీయ రహదారితో కలుపుతూ మీర్ ఆలం చెరువు మీదుగా హైదరాబాద్ కు రెండో కేబుల్ బ్రిడ్జి త్వరలో రానుంది. రూ.363 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు లేన్ల హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.
హైదరాబాద్ మరో కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. చింతల్ మెట్ రోడ్డును బెంగళూరు జాతీయ రహదారితో కలుపుతూ మీర్ ఆలం చెరువు మీదుగా హైదరాబాద్ కు రెండో కేబుల్ బ్రిడ్జి త్వరలో రానుంది. రూ.363 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు లేన్ల హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. మీర్ ఆలం చెరువుపై నాలుగు లైన్ల కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతి ఇచ్చిన TelanganaCMO ధన్యవాదాలు అని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేశారు. ‘ఇది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పని. మీర్ ఆలం ట్యాంక్ చుట్టుపక్కల పనులు జీవనోపాధిని మెరుగుపర్చడంలో బాగా ఉపయోగపడుతుంది. అదే సమయంలో ప్రజలకు వినోద స్థలాన్ని కూడా అందిస్తాయి. ఈ కేబుల్ బ్రిడ్జి ప్రయాణికులకు కూడా సహాయపడుతుందనడంలో సందేహం లేదు”.
మీర్ ఆలం చెరువుపై 2.65 కిలోమీటర్ల పొడవైన నగరంలోని రెండో కేబుల్ బ్రిడ్జిని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం భూ సేకరణకు ప్రణాళికలు సిద్ధం చేశారు. బ్రిడ్జి నిర్మాణంతో ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు హైదరాబాద్ లో పర్యాటకం పెరుగుతుంది. మూసీ నదికి దక్షిణంగా ఉన్న మీర్ ఆలం చెరువుకు హైదరాబాద్ సంస్థానం మాజీ ప్రధాని మీర్ ఆలం బహదూర్ పేరు పెట్టారు. ఒకప్పుడు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ల ఏర్పాటుకు ముందు హైదరాబాద్ వాసులకు ప్రధాన తాగునీటి వనరుగా ఉండేది.
మాదాపూర్ లోని ఇనార్బిట్ మాల్ సమీపంలో ఉన్న హైదరాబాద్ మొదటి కేబుల్ బ్రిడ్జి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి జూబ్లీహిల్స్ ను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తో కలుపుతుంది. ఇది ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. మీర్ ఆలం ట్యాంక్ పై నిర్మించనున్న కేబుల్ బ్రిడ్జి పూర్తయితే హైదరాబాద్ లో రెండో వంతెన అవుతుంది. హైదరాబాద్ పర్యాటకంగా డెవలప్ అవుతుండటంతో కాంగ్రెస్ ప్రభుత్వ కూడా పలు ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు మొగ్గు చూపుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..