Nalgonda: ఉద్యోగం రాలేదని శ్రీశైలం దర్శనం కోసం వెళ్లిన యువకుడు.. ఆ తర్వాత ఏం చేశాడంటే
ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువత కాంపిటీటివ్ పరీక్షలు రాస్తుంటారు. ఇందుకోసం ప్రిపేర్ అయి కష్టపడి ఎగ్జామ్స్ రాస్తుంటారు. కానీ రాసిన నిరుద్యోగులందరికీ.. ప్రభుత్వ ఉద్యోగాలు రావడం సాధ్యం కాని పని. ప్రభుత్వ ఉద్యోగం రాలేదని ఓ నిరుద్యోగ యువకుడు
ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువత కాంపిటీటివ్ పరీక్షలు రాస్తుంటారు. ఇందుకోసం ప్రిపేర్ అయి కష్టపడి ఎగ్జామ్స్ రాస్తుంటారు. కానీ రాసిన నిరుద్యోగులందరికీ.. ప్రభుత్వ ఉద్యోగాలు రావడం సాధ్యం కాని పని. ప్రభుత్వ ఉద్యోగం రాలేదని ఓ నిరుద్యోగ యువకుడు మానసికంగా కుంగిపోయే రిజర్వాయర్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా మునుగోడుకు చెందిన చెరుపల్లి గిరీష్ కుమార్(30) ఆరేళ్ల క్రితం బీటెక్ పూర్తి చేశాడు. పలు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగా లకు ప్రిపేర్ అయి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాశాడు. కానీ ఉద్యోగం రాకపోవడంతో గిరీష్ కుమార్ మానసికంగా కుంగిపోయాడు.
మానసిక ప్రశాంతత కోసం శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకొని వస్తానని ఈనెల 9వ తేదీన ఇంట్లో నుంచి శ్రీశైలం వెళ్లాడు. శ్రీశైలంలో శివుడి దర్శనం తర్వాత కూడా కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. శ్రీశైలం నుంచి 10వ తేదీన తిరుగు ప్రయాణంలో గిరీష్ కుమార్ డిండికి చేరుకున్నాడు. డిండి ప్రాజెక్టు వద్ద సాయంత్రం వరకు అక్కడే ఉన్న గిరీష్ కుమార్ సాయంత్రం డిండి రిజర్వాయర్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీశైలం వెళ్ళిన గిరీష్ కుమార్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.
డిండి రిజర్వాయర్ లో ఉదయం చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు మృతదేహం కనిపించింది. పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి ఆధార్ కార్డు ఆధారంగా మృతుడు గిరీష్ కుమార్ గా గుర్తించారు. ఆత్మవిశ్వాసంతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించాలి.. కానీ ఆత్మహత్య చేసుకోవడం పరిష్కారం కాదని పోలీసులు నిరుద్యోగ యువతకు సూచిస్తున్నారు.