AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహిళలకు గుడ్ న్యూస్.. రూ.2,500 సాయం, వడ్డీలేని రుణాలు, రేషన్ కార్డులు..! తెలంగాణ కేబినెట్‌ భేటీపై ఉత్కంఠ

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌కి ముందు నేటి తెలంగాణ కేబినెట్‌ భేటీపై ఉత్కంఠ రేపుతంది. ఎన్నికల తాయిలాల కోసమే కేబినెట్ భేటీ అనే చర్చ జరుగుతుంది. ఇంతకీ ఇవాళ్టీ మంత్రిమండలి సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి. ఏఏ వర్గాలకు మేలు జరగనుంది. అనే విషయాలు ఆసక్తిరేపుతున్నాయి. రెండు మూడు రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తున్న తరుణంలో నేడు తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుండడం చర్చనీయాంశంగా మారింది.

మహిళలకు గుడ్ న్యూస్.. రూ.2,500 సాయం, వడ్డీలేని రుణాలు, రేషన్ కార్డులు..! తెలంగాణ కేబినెట్‌ భేటీపై ఉత్కంఠ
Revanth Reddy
Shaik Madar Saheb
|

Updated on: Mar 12, 2024 | 1:01 PM

Share

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌కి ముందు నేటి తెలంగాణ కేబినెట్‌ భేటీపై ఉత్కంఠ రేపుతంది. ఎన్నికల తాయిలాల కోసమే కేబినెట్ భేటీ అనే చర్చ జరుగుతుంది. ఇంతకీ ఇవాళ్టీ మంత్రిమండలి సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి. ఏఏ వర్గాలకు మేలు జరగనుంది. అనే విషయాలు ఆసక్తిరేపుతున్నాయి. రెండు మూడు రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తున్న తరుణంలో నేడు తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుండడం చర్చనీయాంశంగా మారింది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు సెక్రటేరియట్ తెలంగాణ మంత్రి మండలి సమావేశం అవుతుంది. ఎన్నికలను ప్రభావితం చేసేలా పలు కీలకనిర్ణయాలు కేబినెట్‌లో తీసుకుంటారనే చర్చ జరుగుతుంది. కేబినెట్ ఎజెండా విడుదల చేయనప్పటికీ కచ్చితంగా ఎన్నికల తాయిలాలు ఉండే అవకాశం లేకపోలేదని టాక్ వినిపిస్తుంది. అయితే ఈనెల 17తో కాంగ్రెస్ చెప్పిన ఆరు గ్యారంటీల అమలుకు 100రోజుల గడువు ముగుస్తుంది. ఇప్పటికే 5 గ్యారంటీలను అమలు చేసిన కాంగ్రెస్.. మహిళలకు నెలకు 2500 రూపాయల ఆర్థిక సహాయం హామీపై ఇంకా క‌స‌ర‌త్తు కొనసాగుతూనే ఉంది. ఈ హామీపై ఇవాళ్టి కేబినెట్‌ భేటీలో ప్రకటన ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. అలాగే తెల్లరేషన్ కార్డు దరఖాస్తుల పరిశీలనకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. 2008 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాల విషయంలో వారంరోజుల్లో గుడ్ న్యూస్ చెప్తామని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో దీనిపై చర్చించనున్నారు. అంతేకాదు 11కొత్త బీసీ కార్పోరేషన్ల ఏర్పాటుపై కేబినెట్ చర్చించనుంది.

కోదండరాం, అమీర్‌అలీ ఖాన్ పేర్లకు ఆమోదం.. గవర్నర్‌కి సిఫారసు

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను పునఃపరిశీలించాలని హైకోర్టు సూచన చేసిన నేపథ్యంలో దీనిపై కేబినెట్‌లో చర్చకు రానుంది. కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లకు ఆమోదం తెలిపి గవర్నర్‌కు సిఫారసు చేయనున్నారు. ఇవాళ పరేడ్‌ గ్రౌండ్‌లో డ్వాక్రామహిళలకు వడ్డీలేని రుణాల పథకానికి శ్రీకారం చుడుతున్న క్రమంలో తెలంగాణ మహిళా శక్తి పథకానికి కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వనుంది. అలాగే వివిధ శాఖల్లో ఉన్న 1100 మంది రిటైర్డ్ ఉద్యోగుల కొనసాగింపుపై మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంటుంది. అటు ఎన్నికల ముందు ఉద్యోగులను ఆకట్టుకునేలా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, డీఏ పెంపు, కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ లకు మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. మొత్తానికి లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేబినెట్‌ భేటీలో కీలకనిర్ణయాలు తీసుకోనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందనుకున్నా.. కానీ ఫ్లాప్ అయ్యింది
ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందనుకున్నా.. కానీ ఫ్లాప్ అయ్యింది
చాలా రోజుల తర్వాత కనిపించిన రవితేజ కూతురు.. క్యూట్ ఫొటోస్ ఇదిగో
చాలా రోజుల తర్వాత కనిపించిన రవితేజ కూతురు.. క్యూట్ ఫొటోస్ ఇదిగో
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు
బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది
బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి