Telangana: ‘భలే పనిమంతులు..’ ఉద్యోగులు సమయానికి ఆఫీసుకి వస్తే ఒట్టు..!

తెలంగాణ సెక్రటేరియట్‌కు ఎవరైనా రావొచ్చిప్పుడు. ఎలాంటి అడ్డంకుల్లేవ్. సరే.. వెళ్తే మాత్రం ప్రయోజనమేంటి? ఎవరిని కలవాలి? ఖాళీ కుర్చీలకు, ఉద్యోగులు లేని ఛాంబర్లకు దరఖాస్తులు ఇవ్వాలా? ఆఫీస్‌ తెరిచే సమయానికి వెళ్తే గంట, గంటన్నరకు కూడా ఎంప్లాయిస్‌ రావడం లేదే..! ఎవరికివ్వాలి అప్లికేషన్లు..? ప్రతి ఒక్కరికి భయం, బాధ్యత ఉండాల్సిందే. ప్రజలు కడుతున్న పన్నులతో జీతాలు తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులకైతే.. ఇంకాస్త బాధ్యత ఉండాలి. బట్.. తెలంగాణలో అలాంటి వాతావరణమే కనిపించడం లేదు.

Telangana: 'భలే పనిమంతులు..' ఉద్యోగులు సమయానికి ఆఫీసుకి వస్తే ఒట్టు..!
Government Office
Follow us

|

Updated on: Jul 05, 2024 | 9:29 AM

‘ఆయనకేంటండి ప్రభుత్వ ఉద్యోగి.. మహా అదృష్టవంతుడు’. ‘ఎప్పుడైనా వెళ్లొచ్చు, ఎప్పుడైనా రావొచ్చు.. ఆలస్యంగా వెళ్లారని అడిగేదెవరు, తొందరగా వెళ్లిపోతే మాత్రం ఆపేదెవరు?. చాలాసార్లు, చాలా సందర్భాల్లో వినుంటాం ఈ మాటలు. ఊరికే కామెంట్‌ చేయడం కాదు గానీ.. ప్రభుత్వ ఉద్యోగులపై ప్రజల అభిప్రాయం ఇలాగే ఉంది. గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌పై ఈ నెగిటివిటీ రావడానికి జనం పడుతున్న కష్టాలే కారణం. ‘ఆఫీసుకు లేట్‌గా వచ్చిన ఉద్యోగులు.. స్వయంగా తనిఖీ చేసిన ముఖ్యమంత్రి’. ఈ సీన్లు సినిమాల్లో సూపర్‌ హిట్‌ అవుతాయి. ఎందుకో తెలుసా? ఉద్యోగుల పనితీరుపై అపరిచితుడు, భారతీయుడు-1-2-3 అని సినిమాలు తీస్తుంటే సూపర్‌ హిట్‌ చేస్తున్నారు. ఎందుకో తెలుసా? జనాల్లో నాటుకుపోయిన అభిప్రాయం అదే కాబట్టి. లేట్‌గా వచ్చినా.. వాళ్లు వచ్చిందే రైట్‌ టైం. వాళ్ల వాచ్‌ ప్రకారం టైమ్‌కు వచ్చినట్టే లెక్క. ఇందుకు కాదు ప్రైవేటీకరణే బెటర్‌ అనే వాదనకు బలం వస్తున్నది. సర్కారీ బడుల్లో పిల్లల్ని చేర్చకపోవడానికి, ప్రభుత్వ ఉద్యోగులై ఉండి ప్రభుత్వ బడికి పంపకపోవడానికి కారణం ఈ టైమ్‌సెన్స్ లేకపోవడం కాదూ..! ఆఫీసులకి ఎప్పుడొస్తారో తెలీదు. కొందరు ఘనులైతే.. తమ ప్లేసులో వాలంటీర్లను పెట్టి మరీ బయట వ్యాపారాలు చేసుకుంటూ ఉండిపోతారు. గతంలో ఇలా జరిగిన సందర్భాలున్నాయ్‌ కూడా. అందుకే, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచకపోయినా, ఒకటో తేదీనే జీతాలు ఇవ్వకపోయినా.. అదో ప్రజా ఉద్యమంగా మారదు. జనం అస్సలు పట్టించుకోరు. కారణం.. ప్రభుత్వ ఉద్యోగులపై జనాల్లో నాటుకుపోయిన ఒక వ్యతిరేక భావన.

మొన్నామధ్య.. సీఎం రేవంత్‌రెడ్డి ఓ మాట అన్నారు. ఇన్నాళ్లు 12 గంటలు పనిచేస్తే సరిపోతుందనుకున్నా. ఇక నుంచి 18 గంటలు పనిచేయాల్సిందేనని స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇక్కడ ముఖ్యమంత్రి మాత్రమే 18 గంటలు పనిచేస్తే సరిపోదుగా.. అంతిమంగా ఆ పని పూర్తయ్యేలా చేయాల్సింది ప్రభుత్వ ఉద్యోగులే. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సచివాలయంలో తనిఖీకి వెళ్లినప్పుడు కూడా ఇదే మాట అన్నారు. ‘ప్రజలు తమకు ఎన్ని వినతులు ఇచ్చినా.. అల్టిమేట్‌గా పరిష్కరించాల్సింది ఉద్యోగులే.. మీరే ఆలస్యంగా వస్తే ఎలా’ అని ప్రశ్నించారు. దారుణమైన విషయం ఏంటంటే.. స్వయంగా మంత్రులే వచ్చి తనిఖీ చేస్తున్నా.. కొందరు ప్రభుత్వ ఉద్యోగులలో ఏమాత్రం చలనం రావడం లేదు. ఇక్కడ ‘కొందరు’ అనే పదం వాడడం కంటే ‘దాదాపుగా అందరూ’ అనడం కరెక్ట్‌ అనుకుంటా. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలోని అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్‌కు వెళ్లినప్పుడు.. ఛాంబర్స్‌ అన్నీ ఖాళీ. ఒక్కరు టైమ్‌కు వస్తే ఒట్టు. హండ్రెడ్‌ పర్సెంట్‌ ఆబ్సెంట్.

తుమ్మల నాగేశ్వరరావు కంటే ముందు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్లు, భవనాల శాఖకు సంబంధించిన ఛాంబర్లకు, పేషీకి వెళ్లారు. సుమారు గంటన్నర పాటు ఆ చాంబర్లలోనే ఉన్నారు. ఉదయం పది గంటల నుంచి దాదాపు పదకొండున్నర వరకు మంత్రి కోమటిరెడ్డి ఉద్యోగులు ఎప్పుడొస్తున్నారు, ఎంత ఆలస్యంగా వస్తున్నారని గమనించారు. ఉదయం పదకొండున్నర సమయంలో ఆఫీసులకు వచ్చింది సగం మంది ఉద్యోగులే. కనీసం 50 శాతం మంది ఉద్యోగులు కూడా ఆఫీసుకు రాకపోవడంతో మంత్రి కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. గత పదేళ్లుగా ముఖ్యమంత్రిని, మంత్రులను కలిసే అవకాశం లేక జనం సమస్యలతో అల్లాడిపోతే.. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు అందుబాటులో లేకపోవడం వల్ల ఇబ్బంది పడాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మినిస్టర్ కోమటిరెడ్డి చెప్పింది అక్షరాలా నిజం. సెక్రటేరియట్‌లోకి సామాన్యులకు కూడా అనుమతి ఇవ్వడంతో.. కష్టాలు నేరుగా చెప్పుకునేందుకు దరఖాస్తులను పట్టుకుని ఊళ్ల నుంచి వస్తున్నారు బాధితులు. తీరా చూస్తే.. ఛాంబర్లలో అధికారులు ఉండడం లేదు. తామేమో ఉదయం 4 గంటలకే లేచి పని మొదలుపెడుతుంటే.. ఉదయం పదిన్నరకు రావాల్సిన ఉద్యోగులు పదకొండున్నర దాటినా రాకపోతే ఎలా అని అసహనం వ్యక్తం చేశారు.

స్వయంగా మంత్రే ఇన్‌స్పెక్షన్‌కు వచ్చారు కదా.. ఇకనైనా సమయానికి వస్తారేమోనని ఆశించి సెక్రటేరియట్‌కు వెళ్తే మళ్లీ అవే సీన్స్‌ కనిపించాయి. మంత్రి తనిఖీ తరువాత సెక్రటేరియట్‌లో పరిస్థితి ఎలా ఉందో చూసేందుకు వెళ్లింది టీవీ9 టీమ్. హైదరాబాద్‌లో ఎంప్లాయిస్‌ ఆఫీసుకు రావాల్సిన సమయం.. ఉదయం పదిన్నర. గ్రేస్ పిరియడ్‌ మరో 15 నిమిషాలు. అంటే.. పావు తక్కువ 11 గంటల కల్లా ప్రభుత్వ ఆఫీసులన్నీ ఉద్యోగులతో నిండిపోవాలి. కాని, ఉదయం పదిన్నరకు వెళ్లినప్పుడు టీవీ9 బృందానికి కనిపించి సీనే.. ఉదయం పదకొండున్నరకు కూడా కనిపించింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అగ్రికల్చర్‌ శాఖకు సంబంధించిన డిపార్ట్‌మెంట్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో సచివాలయంలోని అగ్రికల్చర్‌ సెక్షన్‌లో టీవీ9 ఫ్యాక్ట్‌ చెక్‌ చేయగా సేమ్‌ సీన్ కనిపించింది. ఇందాక చెప్పుకున్నట్టు వంద శాతం అబ్సెంటీస్. ఉద్యోగులు ఎవరూ సమయానికి ఆఫీసుకు రాకపోవడం చూసి ఇన్‌స్పెక్షన్‌కు వచ్చిన మంత్రి తుమ్మల ఆశ్చర్యపోయారు. ఆ తరువాత ఆగ్రహం వ్యక్తం చేశారు.

లైట్లన్నీ వేసి ఉన్నాయ్, ఫ్యాన్లన్నీ తిరుగుతున్నాయ్. ఒక్కో ఛాంబర్‌ వెలిగిపోతోంది. కాని, కుర్చీలు మాత్రం ఖాళీగా ఉన్నాయి. ఎప్పుడో పది గంటలకు వెళ్లి ఖాళీ కుర్చీలను రికార్డ్‌ చేశారని అనుకుంటారేమో. కాదు. ఇక్కడ కనిపిస్తున్న సమయం సరిగ్గా 10 గంటల 57 నిమిషాలు. అంటే.. ఉద్యోగులంతా పనిలో నిమగ్నమవ్వాల్సిన టైం ఇది. మనం చూస్తున్నది సెక్రటేరియట్‌లోని ఇరిగేషన్‌ సెక్షన్‌లో పరిస్థితి. సరిగ్గా ఉదయం 11 గంటలు అయిందప్పుడు. ఒకరిద్దరు మినహా ఎవరూ రాలేదు. ఇది ఆర్ అండ్ బీ సెక్షన్. సమయం.. ఉదయం 11.05 నిమిషాలు. ఇక్కడా అదే సీన్. ఇక మున్సిపల్ సెక్షన్‌లోకి వెళ్తే.. అన్నీ ఖాళీ కుర్చీలే. అప్పుడు సమయం.. ఉదయయం 11.15 నిమిషాలు. అగ్రికల్చర్ సెక్షన్‌ ఇది. వంద శాతం ఖాళీగా ఉంది. అప్పుడు సమయం.. ఉదయం 11.30 నిమిషాలు. జీఏడీ అండ్‌ ఫైనాన్స్ సెక్షన్. ఇక్కడా ఉద్యోగులు సమయానికి రాలేదు. అప్పుడు సమయం.. ఉదయం 11.35 నిమిషాలు. ఉదయం పదకొండున్నర తరువాత కూడా టీవీ9 పరిశీలనకు వెళ్లింది. అప్పుడు కనిపించినవి కూడా ఈ ఖాళీ కుర్చీలే. చాలా మంది చాలా తీరిగ్గా పదకొండున్నర తరువాత వచ్చి అటెండెన్స్‌ రిజిస్టర్‌లో సైన్ చేస్తున్నారు. నిజానికి ఈ అటెండెన్స్ రిజిస్టర్‌ను ఉదయం 10.45కే తీసుకెళ్లిపోవాలి. మహా అయితే.. 11 గంటల వరకు ఉంచుతారు. కాని, పదకొండున్నర అయినా సరే అటెండెన్స్‌ రిజిస్టర్ అక్కడే ఉంటోంది. ఎప్పుడైనా సంతకం పెట్టొచ్చు కదా అని లేట్‌గా వస్తున్నారో, లేక తాము వచ్చిందే టైమ్‌ కాబట్టి రిజిస్టర్‌ ఉండాల్సిందేనని ఆర్డర్స్‌ ఇచ్చారో గానీ.. సెక్రటేరియట్‌లో జరుగుతున్నదైతే ఇది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

ఈ ప్రాంతంలో శ్రీరాముడు, సీతాదేవీ విడిది చేసిన ఆనవాళ్లు
ఈ ప్రాంతంలో శ్రీరాముడు, సీతాదేవీ విడిది చేసిన ఆనవాళ్లు
తనను జైళ్లో పెట్టాలన్న డాక్టర్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చిన సమంత.!
తనను జైళ్లో పెట్టాలన్న డాక్టర్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చిన సమంత.!
సనాతనం సమ్మోహనం.. పవన్ కళ్యాణ్ దీక్ష విరమణ.. వీడియో.
సనాతనం సమ్మోహనం.. పవన్ కళ్యాణ్ దీక్ష విరమణ.. వీడియో.
నెట్టింట రంభ కూతురు వీడియో వైరల్.. మరో హీరోయిన్ దొరికినట్టేగా.!
నెట్టింట రంభ కూతురు వీడియో వైరల్.. మరో హీరోయిన్ దొరికినట్టేగా.!
హీరోయిన్ ఇంట్లో చోరీ.! అడ్డంగా దొరికిన దొంగ.. ఇద్దరు అరెస్ట్.!
హీరోయిన్ ఇంట్లో చోరీ.! అడ్డంగా దొరికిన దొంగ.. ఇద్దరు అరెస్ట్.!
తన ఊరి కోసం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబోస్‌.!
తన ఊరి కోసం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబోస్‌.!
'డాక్టర్‌లా ఫీలైపోయి ఉచిత సలహాలు ఇవ్వొద్దు'.. సమంత పై సీరియస్.
'డాక్టర్‌లా ఫీలైపోయి ఉచిత సలహాలు ఇవ్వొద్దు'.. సమంత పై సీరియస్.
సాయంలో తండ్రిని మించేస్తున్న తనయుడు.! డ్యాన్సర్స్‌కు చెర్రీ సాయం.
సాయంలో తండ్రిని మించేస్తున్న తనయుడు.! డ్యాన్సర్స్‌కు చెర్రీ సాయం.
కల్కి 2లో ప్రభాస్‌ ఎలా కనిపించబోతున్నాడో చెప్పిన నాగి.!
కల్కి 2లో ప్రభాస్‌ ఎలా కనిపించబోతున్నాడో చెప్పిన నాగి.!
అన్నయ్య అప్పు తీర్చడానికి రిస్క్‌ తీసుకున్న పవర్ స్టార్.!
అన్నయ్య అప్పు తీర్చడానికి రిస్క్‌ తీసుకున్న పవర్ స్టార్.!