Telangana: రైతు భరోసాపై భేటీకానున్న కేబినెట్ సబ్ కమిటీ.. ఈ అంశాలపై చర్చ..

తెలంగాణలో రైతు భరోసా అమలుపై కేబినెట్ సబ్‌ కమిటీ భేటీ కానుంది. హైదరాబాద్‎లోని రాష్ట్ర సచివాలయంలో ఇవాళ మంత్రులు, ఆయా శాఖల ప్రధాన కార్యదర్శులు భేటీ కానున్నారు. రైతు భరోసా విధివిధానాలపై సబ్ కమిటీ కసరత్తు చేయనుంది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీని ఏడు నెలలు అయింది. అయితే మొన్నటి వరకూ లోక్ సభ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా పలు సంక్షేమ పథకాలకు అంతరాయం ఏర్పాడింది. అయితే ప్రస్తుతం పాలనపై ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి సర్కార్.

Telangana: రైతు భరోసాపై భేటీకానున్న కేబినెట్ సబ్ కమిటీ.. ఈ అంశాలపై చర్చ..
Cabinet Sub Committee
Follow us

|

Updated on: Jul 05, 2024 | 12:36 PM

తెలంగాణలో రైతు భరోసా అమలుపై కేబినెట్ సబ్‌ కమిటీ భేటీ కానుంది. హైదరాబాద్‎లోని రాష్ట్ర సచివాలయంలో ఇవాళ మంత్రులు, ఆయా శాఖల ప్రధాన కార్యదర్శులు భేటీ కానున్నారు. రైతు భరోసా విధివిధానాలపై సబ్ కమిటీ కసరత్తు చేయనుంది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీని ఏడు నెలలు అయింది. అయితే మొన్నటి వరకూ లోక్ సభ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా పలు సంక్షేమ పథకాలకు అంతరాయం ఏర్పాడింది. అయితే ప్రస్తుతం పాలనపై ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి సర్కార్. ఎన్నికల ప్రచారంలో భాగంగా కౌలు రైతులకు కూడా రైతు భరోసా అందిస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీని మేనిఫెస్టోలో కూడా పొందుపరిచింది. దీంతో కౌలు రైతులకు కూడా రైతు భరోసా అందించే అంశంపై చర్చించేందుకు కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది.

అయితే ఈ హామీ అమలు చేయాంటే ప్రభుత్వం దగ్గర కౌలు రైతులకు సంబంధించిన సమాచారం, వివరాలు అందుబాటులో లేవు. అందుకే కౌలు రైతులను గుర్తించడంపై సబ్‌ కమిటీ భేటీలో చర్చ జరగనుంది. ఇప్పటి వరకు 50 వేల మంది రైతుల నుంచి అభిప్రాయ సేకరణ జరిపారు అధికారులు.10 ఎకరాల వరకు ఉన్నవారికి రైతు భరోసా ఇవ్వాలని.. నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పలు రైతు సంఘాల నుంచి ప్రభుత్వానికి కొన్ని వినతులు అందాయి. కేవలం 10 ఎకరాల వారికే కాకుండా తక్కువ పొలంలో కౌలు చేసుకుంటున్న కుటంబాలను కూడా ఆదుకోవాలని కోరారు రైతు సంఘాల నాయకులు. వారి అభ్యర్థన మేరకు 5 ఎకరాలలోపు ఉన్న రైతులకు రైతు భరోసా అందజేసేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. అందులో భాగంగానే ఈ కమిటీ సమావేశం కానుంది. అంతేకాకుండా రైతు భరోసా నిధులపై కూడా ఈ కేబినెట్ సబ్ కమిటీలో చర్చ జరగనున్నట్లు సమాచారం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

ఈ ప్రాంతంలో శ్రీరాముడు, సీతాదేవీ విడిది చేసిన ఆనవాళ్లు
ఈ ప్రాంతంలో శ్రీరాముడు, సీతాదేవీ విడిది చేసిన ఆనవాళ్లు
తనను జైళ్లో పెట్టాలన్న డాక్టర్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చిన సమంత.!
తనను జైళ్లో పెట్టాలన్న డాక్టర్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చిన సమంత.!
సనాతనం సమ్మోహనం.. పవన్ కళ్యాణ్ దీక్ష విరమణ.. వీడియో.
సనాతనం సమ్మోహనం.. పవన్ కళ్యాణ్ దీక్ష విరమణ.. వీడియో.
నెట్టింట రంభ కూతురు వీడియో వైరల్.. మరో హీరోయిన్ దొరికినట్టేగా.!
నెట్టింట రంభ కూతురు వీడియో వైరల్.. మరో హీరోయిన్ దొరికినట్టేగా.!
హీరోయిన్ ఇంట్లో చోరీ.! అడ్డంగా దొరికిన దొంగ.. ఇద్దరు అరెస్ట్.!
హీరోయిన్ ఇంట్లో చోరీ.! అడ్డంగా దొరికిన దొంగ.. ఇద్దరు అరెస్ట్.!
తన ఊరి కోసం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబోస్‌.!
తన ఊరి కోసం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబోస్‌.!
'డాక్టర్‌లా ఫీలైపోయి ఉచిత సలహాలు ఇవ్వొద్దు'.. సమంత పై సీరియస్.
'డాక్టర్‌లా ఫీలైపోయి ఉచిత సలహాలు ఇవ్వొద్దు'.. సమంత పై సీరియస్.
సాయంలో తండ్రిని మించేస్తున్న తనయుడు.! డ్యాన్సర్స్‌కు చెర్రీ సాయం.
సాయంలో తండ్రిని మించేస్తున్న తనయుడు.! డ్యాన్సర్స్‌కు చెర్రీ సాయం.
కల్కి 2లో ప్రభాస్‌ ఎలా కనిపించబోతున్నాడో చెప్పిన నాగి.!
కల్కి 2లో ప్రభాస్‌ ఎలా కనిపించబోతున్నాడో చెప్పిన నాగి.!
అన్నయ్య అప్పు తీర్చడానికి రిస్క్‌ తీసుకున్న పవర్ స్టార్.!
అన్నయ్య అప్పు తీర్చడానికి రిస్క్‌ తీసుకున్న పవర్ స్టార్.!