Hyderabad: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు చేదు అనుభవం.. కొత్త సచివాలయంలోకి నో ఎంట్రీ..

బీజేపీ బహిష్కృత నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నూతన సచివాలయంలో చేదు అనుభవం ఎదురైంది. గ్రేటర్ ప్రజాప్రతినిధుల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన్ను సచివాలయంలోకి అనుమతించలేదు సెక్యూరిటీ సిబ్బంది. బుల్లెట్‌పై సెక్రటేరియట్‌కు వచ్చిన రాజాసింగ్‌ను.. భద్రతా సిబ్బంది అడ్డగించారు. దాంతో కాసేపు అక్కడే వెయిట్ చేసిన రాజాసింగ్..

Hyderabad: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు చేదు అనుభవం.. కొత్త సచివాలయంలోకి నో ఎంట్రీ..
MLA Raja Singh
Follow us
Shiva Prajapati

|

Updated on: May 06, 2023 | 12:08 PM

బీజేపీ బహిష్కృత నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నూతన సచివాలయంలో చేదు అనుభవం ఎదురైంది. గ్రేటర్ ప్రజాప్రతినిధుల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన్ను సచివాలయంలోకి అనుమతించలేదు సెక్యూరిటీ సిబ్బంది. బుల్లెట్‌పై సెక్రటేరియట్‌కు వచ్చిన రాజాసింగ్‌ను.. భద్రతా సిబ్బంది అడ్డగించారు. దాంతో కాసేపు అక్కడే వెయిట్ చేసిన రాజాసింగ్.. ఇక లాభం లేదనుకుని వెనక్కి తిరిగి వచ్చేశారు.

ఇదిలాఉంటే.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో సచివాలయంలో గ్రేటర్ ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కూడా ఆహ్వానం పంపారు. ఇదే విషయాన్ని మంత్రి పేషీ కూడా చెబుతుతోంది. తాము ఆహ్వానం పంపామని, రాజాసింగ్ గేటు వరకు వచ్చి వెళ్లిపోయారని మంత్రి పేషీ ప్రకటించింది.

రాజాసింగ్ ఆగ్రహం..

సెక్రటేరియట్‌లో మీటింగ్‌ అని చెప్పి తనను ఆహ్వానించి లోనికి అనుమతించకపోవడాన్ని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తీవ్రంగా తప్పుబట్టారు. ఎమ్మెల్యేలు కూడా సెక్రటేరియట్‌ లోపలికి రాకూడాదా అని ప్రశ్నించారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..