ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు గుడ్ న్యూస్… వారంలోగా ఇళ్ల ప్రక్రియ పూర్తి : మంత్రి పొంగులేటి
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారంలోగా ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ పూర్తి చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. మూడు, నాలుగేళ్లలోగా పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని ఆయన చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు నిర్మిస్తామని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు తాము వడ్డీలు కట్టడానికే సరిపోతుందని ఆయన విమర్శించారు. వడ్డీ కడుతూనే

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారంలోగా ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ పూర్తి చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. మూడు, నాలుగేళ్లలోగా పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని ఆయన చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు నిర్మిస్తామని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు తాము వడ్డీలు కట్టడానికే సరిపోతుందని ఆయన విమర్శించారు. వడ్డీ కడుతూనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు మంత్రి పొంగులేటి. ఓర్వలేకనే తమపై విమర్శలు చేస్తున్నారని పొంగులేటి ఆరోపించారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి వారం రోజుల్లో పనులు మొదలు పెడతామని తెలిపారు. లబ్దిదారుల జాబితాలో పేర్లు రాని వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఒక నిరంతర ప్రక్రియ అని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇందులో భాగంగా మళ్లీ విడతలో అధికారులు నిజమైన లబ్ధిదారులను గుర్తించి ఎంపిక చేస్తారని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను ప్రారంభించింది. వాటిని వేర్వేరుగానే అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయింది. నారాయణపేట జిల్లాలోని అప్పకపల్లెలో ఇందిరమ్మ ఇళ్లకు ఫిబ్రవరి 21న సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద లబ్ధిదారుల నుంచి ఇప్పటికే అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం వారిలో అర్హులైన లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేశారు. తొలి విడతలో 72,045 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సబ్సిడీతో కూడిన ఆర్థిక సాయం అందించనున్నారు.