Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటర్ ఇంగ్లిష్‌ సబ్జెక్టులో ఆ ప్రశ్న అటెంప్ట్ చేస్తే చాలు.. ఫుల్ మార్క్స్: ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం

తెలంగాణలో మార్చి 10న జరిగిన ఇంటర్‌మీడియట్‌ సెకండ్‌ ఇయర్‌ ఇంగ్లిష్‌ పరీక్ష ప్రశ్నాపత్రంలో ప్రింటింగ్‌ మిస్టేక్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే. దీనివల్ల అక్షరాలు కనిపించక రాష్ట్రవ్యాప్తంగా పలు కేంద్రాల్లోని విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. ఈ క్రమంలో విద్యార్ధుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఇంటర్‌ బోర్డు దిగొచ్చింది..

ఇంటర్ ఇంగ్లిష్‌ సబ్జెక్టులో ఆ ప్రశ్న అటెంప్ట్ చేస్తే చాలు.. ఫుల్ మార్క్స్: ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం
పరీక్ష కేంద్రాలకు పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు దాంతోపాటు పరీక్షా కేంద్రం సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. మాల్ ప్రాక్టీస్ లేదా ఇతరత్రా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. ప్రతి పరీక్షా కేంద్రం చీఫ్ సూపర్డెంట్ ఆఫీస్ రూమ్ లో ఒక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడ హైదరాబాద్లోని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆఫీస్ లోని కంట్రోల్ రూమ్ నుంచి ప్రత్యేకంగా పర్యవేక్షించనున్నారు. విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ గార్డెన్స్ తీసుకొని రావద్దని సూచించారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ఇప్పటికే ప్రశ్న పత్రాలపై క్యూఆర్ కోడ్ తో పాటు సీరియల్ నెంబర్ను విద్యాశాఖ ముద్రించింది.
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 11, 2025 | 4:26 PM

హైదరాబాద్‌, మార్చి 7: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మార్చి 10న జరిగిన ఇంటర్‌మీడియట్‌ సెకండ్‌ ఇయర్‌ ఇంగ్లిష్‌ పరీక్ష ప్రశ్నాపత్రంలో ప్రింటింగ్‌ మిస్టేక్స్‌ వల్ల అక్షరాలు కనిపించక రాష్ట్రవ్యాప్తంగా పలు కేంద్రాల్లోని విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. ఈ క్రమంలో విద్యార్ధుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఇంటర్‌ బోర్డు దిగొచ్చింది. ఇంగ్లిష్‌ పరీక్షలో 7వ ప్రశ్నకు మార్కులు కలుపుతామని ఇంటర్‌బోర్డు తాజాగా ప్రకటించింది. 4 మార్కుల 7వ ప్రశ్నకు ముద్రణ లోపం వల్ల సరిగా కనిపించకపోవడంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారని, పైచార్టులో ఇచ్చిన శాతాలు స్పష్టంగా ఉన్నా.. వాటిని వివరిస్తూ పక్కన చిన్నబాక్సుల్లో ఇచ్చిన చుక్కలు, గీతలు సరిగా కనిపించలేదు. దీంతో అనేక పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు ఈ విషయాన్ని ఇన్విజిలేటర్ల దృష్టికి తీసుకెళ్లారు.

కొన్ని చోట్ల ఇంటర్‌బోర్డు నుంచి ఎటువంటి సమాచారం రాలేదని, తెలిసిన మేరకు విద్యార్ధులను జవాబులు రాయాలని ఇన్విజిలేటర్లు చెప్పారు. జడ్చర్ల తదితర చోట్ల చీఫ్‌ సూపరింటెండెంట్లకు పరీక్ష రాసిన కొందరు విద్యార్థులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై సబ్జెక్టు నిపుణులతో చర్చించిన బోర్డు ఆ ప్రశ్నకు సమాధానం రాసేందుకు అటెంప్ట్‌ చేసిన వారందరికీ 4 మార్కులు ఇవ్వాలని ఇంటర్‌బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఓ ప్రకటన జారీ చేశారు. మార్చి 10న జరిగిన ఇంగ్లిష్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 4,33,963 మంది హాజరుకాగా.. 13,029 మంది విద్యార్ధులు గైర్హాజరయ్యారు.

కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 5 నుంచి ప్రారంభమయ్యాయి. ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు మార్చి 24 వరకు, సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు మార్చి 25 వరకు జరగనున్న సంగతి తెలిసిందే

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.