JEE Main Session 2 Schedule 2025: జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది.. ఏ పరీక్ష ఏయే తేదీల్లోనంటే
జేఈఈ మెయిన్ 2025 (ఏప్రిల్) తుది విడత పరీక్షల షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తాజాగా విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 2 నుంచి ఈ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఆయా తేదీల్లో రోజుకు రెండు సెషన్ల చొప్పున ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్షలు జరుగుతాయి. పరీక్షకు 4 రోజుల ముందు అడ్మిట్ కార్డులు విడుదల చేస్తారు..

హైదరాబాద్, మార్చి 7: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ 2025 తుది విడత పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ మెయిన్ సెషన్ 2 షెడ్యూల్‌ను విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీల్లో పేపర్1 పరీక్ష జరుగుతుంది. ఇక ఏప్రిల్ 9వ తేదీన బీఆర్క్/బీ ప్లానింగ్ పేపర్ 2ఏ, 2బీ ప్రవేశ పరీక్ష జరుగుతుంది. ఆయా తేదీల్లో రోజుకు రెండు సెషన్ల చొప్పున ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్షలు జరుగుతాయి.
కాగా జేఈఈ మెయిన్ పరీక్షలు యేటా రెండు విడతల్లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తొలి విడత పరీక్షలు జనవరి 22వ తేదీన ప్రారంభమై మొత్తం 8 రోజుల పాటు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో పేపర్ 1 పరీక్షలు జరిగాయి. తొలి విడత జేఈఈ మెయిన్ పరీక్ష ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. తాజాగా రెండో సెషన్ పరీక్ష నిర్వహణకు ఎన్‌టీఏ ఏర్పాట్లు చేస్తోంది. బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పేపర్ 1 పరీక్ష ఏప్రిల్ 2,3,4,7 తేదీల్లో రోజుకు రెండు షిఫ్టుల్లో జరుగుతుంది. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మొదటి షిఫ్టు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో షిఫ్టు పరీక్షలు జరుగుతాయి. ఏప్రిల్ 8వ తేదీన పరీక్ష మొదటి షిఫ్టులో మాత్రమే జరగనుంది. అలాగే ఏప్రిల్ 9న పేపర్ 2ఏ (బీఆర్క్), పేపర్-2బి (బిప్లానింగ్, పేపర్ 2ఎ, బి (బీఆర్క్, బి ప్లానింగ్) పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు జరగనుంది.
జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ 2025 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దేశవ్యాప్తంగా ఉన్న నగరాలతో పాటు విదేశాల్లోరూ 15 నగరాల్లో ఈ జేఈఈ మెయిన్ తుది విడత పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తికాగా.. త్వరలోనే సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు విడుదల చేయనున్నారు. పరీక్షకు 4 రోజుల ముందు అడ్మిట్ కార్డులు విడుదల చేస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.