Hyderabad: హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. అందుబాటులకి రానున్న మరో నాలుగు సైక్లింగ్ ట్రాక్స్
తెలంగాణలో కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా సైకిల్ వినియోగానికి జీహెచ్‌ఎంసీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగానే ఖైరతాబాద్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, చార్మినార్, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్ జోన్ల పరిధిలో సైక్లింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

తెలంగాణలో కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా సైకిల్ వినియోగానికి జీహెచ్‌ఎంసీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగానే ఖైరతాబాద్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, చార్మినార్, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్ జోన్ల పరిధిలో సైక్లింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కూకట్‌పల్లిలో మూడు చోట్ల సికింద్రాబాద్ జోన్‌లో ఒక చోట సైక్లింగ్ ట్రాక్ పనులకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం రూ. 5.48 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ పనులన్నీ వచ్చే నాలుగు నెలల్లోగా పూర్తి చేసి ఈ ట్రాక్‌లను అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు తెలిపారు.
సైక్లింగ్ ట్రాక్ లు ఎక్కడెక్కడంటే
1.ఐడీఎల్ లేక్-ఎన్‌హెచ్ 65-జేఎన్‌టీయూ -రెయిన్‌బో విస్టా-ఐడీఎల్ లేక్. దీని (అంచనా వ్యయం రూ. 1.19కోట్లు) 2.హైదర్‌నగర్-జేఎన్‌టీయూ-బాలానగర్ వైజంక్షన్-నర్సాపూర్ క్రాస్‌రోడ్ (రూ. 1.55కోట్లు) 3.నర్సాపూర్ క్రాస్‌రోడ్స్- బాలానగర్ జంక్షన్ -జేఎన్‌టీయూ-హైదర్‌నగర్ (ఐడీఎల్ జంక్షన్ నుంచి జేఎన్‌టీయూ జంక్షన్ వరకు 3 కి.మీలు మినహా) (రూ. 1.15కోట్లు ) 4. తార్నాక-మెట్టుగూడ మెట్రోస్టేషన్ వరకు రోడ్డుకు రెండు వైపులా సైక్లింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేయనున్నారు. (రూ. 1.59కోట్లు)




అయితే ఈ ప్రాంతల్లో ఉదయం రెండు గంటల పాటు సైక్లింగ్ కోసం వినియోగిస్తారు. అనంతరం వాహనాల రాకపోకలను అనుమతి ఇస్తారు. సైక్లింగ్ సమయంలో ట్రాక్‌పైకి వాహనాలు రాకుండా బొల్లార్డ్స్ అడ్డుగా పెడతారు. ఆ తర్వాత వాటిని తొలగిస్తారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..
