Hyderabad: నిరుపేదలకు వైద్యం అందించే దిశగా జీహెచ్ఎంసీ అడుగులు.. మరో 27 బస్తీ దవాఖానలు త్వరలో ఏర్పాటు

Hyderabad: ఓ వైపు మళ్ళీ విజృభిస్తున్న కరోనా.. మరోవైపు సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించే దిశగా తెలంగాణ సర్కార్ దృష్టిపెట్టించి. నిరుపేదలకు తగిన..

Hyderabad: నిరుపేదలకు వైద్యం అందించే దిశగా జీహెచ్ఎంసీ అడుగులు.. మరో 27 బస్తీ దవాఖానలు త్వరలో ఏర్పాటు
Basti Dawakhanas In Hyderab
Follow us
Surya Kala

|

Updated on: Jan 07, 2022 | 5:59 PM

Hyderabad: ఓ వైపు మళ్ళీ విజృభిస్తున్న కరోనా.. మరోవైపు సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించే దిశగా తెలంగాణ సర్కార్ దృష్టిపెట్టించి. నిరుపేదలకు తగిన వైద్యం అందించేలా చర్యలు తీసుకుటుంది.. ఇప్పటికే హైదరాబాద్ నగర ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ సంకల్పించుకుంది. ఈ మేరకు.. జిహెచ్ఎంసి పరిధిలోని 150 డివిజన్లలో నివసించే నిరుపేదలకు వైద్యం తక్షణ వైద్య సాయం అందించేందుకు బస్తీదావఖానాలను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేసింది. నిరుపేదలు వ్యాధిబారిన పడినప్పుడు ఆరోగ్య పరీక్షలకు, చికిత్సకు అనేక ఇబ్బందులను ఎదుర్కొనేవారు. ఆర్థిక చిక్కుల్లో పడేవారు. వీటిని అధిగామించడానికి వైద్యాన్ని వారి ముంగిట్లో తీసుకుని వెళ్లేలా బస్తీదవాఖానాలు ఏర్పాటు చేయడం మూలంగా ఆరోగ్య రక్షణ ఏర్పడింది.

తాజాగా జిహెచ్ఎంసి పరిధిలో డివిజన్ కు రెండు చొప్పున మొత్తం 300 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేసే ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు 256 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశారు. బస్తీలో గల కమ్యూనిటీ హాల్, వార్డు కార్యాలయాలలో ఇతర కార్యాలయాలలో ఏర్పాటు చేస్తున్నారు.ఇప్పటికే  ప్రారంభించిన 256 బస్తీ దవాఖానాలకు విశేష స్పందన వస్తున్నది. మరో 27 బస్తీ దవాఖానాలను ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాటు చేస్తున్నారు.

Also Read:  గంగాసాగర్ మేళాకు కోర్టు గ్రీన్ సిగ్నల్.. దీదీ ప్రభుత్వానికి కీలక సూచనలు..