AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GHMC Announcement: జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం.. ఇక నుంచి మీసేవ కేంద్రాల్లోనూ ఆ పత్రాలను పొందవచ్చు..

GHMC Announcement: జీహెచ్ఎంసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో నూతన విధానానికి శ్రీకారం చుట్టారు.

GHMC Announcement: జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం.. ఇక నుంచి మీసేవ కేంద్రాల్లోనూ ఆ పత్రాలను పొందవచ్చు..
Shiva Prajapati
| Edited By: Pardhasaradhi Peri|

Updated on: Jan 07, 2021 | 2:33 PM

Share

GHMC Announcement: జీహెచ్ఎంసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. ఇక నుంచి మీసేవా కేంద్రాల్లోనూ జనన, మరణ ధ్రువపత్రాలను తీసుకోవచ్చునని జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటించారు. ఆ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. జీహెచ్ఎంసీ తాజా నిర్ణయంతో నగర ప్రజలు జీహెచ్ఎంసీ ప్రాంతీయ కార్యాలయాల చుట్టు తిరిగే శ్రమ తగ్గనుంది.

ఇదిలాఉంటే.. కొన్నాళ్లపాటు జీహెచ్ఎంసీలోని సిటిజన్ సర్వీస్ సెంటర్లలో కూడా ఈ ధ్రువీకరణ పత్రాలను జారీ చేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఈ విధానంలో సర్కిళ్లు యూనిట్‌గా పరిగణనలోకి తీసుకుని ధ్రువపత్రాలు జారీ చేయడం జరుగుతుందన్నారు. ఈ సెంటర్లకు అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు సబ్ రిజిస్ట్రార్లుగా వ్యవహరిస్తారని సంబంధిత ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే, ఈ సబ్‌రిజిస్ట్రార్లు జనన, మరణాలు జరిగిన 30 రోజుల్లో వచ్చిన దరఖాస్తులను మాత్రమే పరిశీలిస్తారని, ఆ గడువు దాటిన తరువాత వచ్చే దరఖాస్తులను రిజిస్ట్రార్ హోదాలో అసిస్టెంట్ మెడికల్ హెల్త్ అధికారులు పరిశీలించి, జారీ చేస్తారని చెప్పారు.

Also read:

US President Trump Live Updates : వాషింగ్టన్‌లో ‘సేవ్ అమెరికా ర్యాలీ’.. భారీగా తరలివచ్చిన ట్రంప్ మద్దతుదారులు

Dhanurmasam mahotsavam: విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ఘనంగా ధనుర్మాస మహోత్సవాలు..