Telangana: తెలంగాణలో రేషన్ కార్డుదారులకు నేటి నుంచే ఉచిత రేషన్ బియ్యం పంపిణీ.. ఒక్కొక్కరి 15 కేజీలు
తెలంగాణలో కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలోరేషన్ కార్డుదారులకు ఉచిత రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభించింది ప్రభుత్వం. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల....
తెలంగాణలో కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలోరేషన్ కార్డుదారులకు ఉచిత రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభించింది ప్రభుత్వం. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రేషన్ షాపుల్లో బియ్యం ఇస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా పంపిణీ చేస్తున్నారు. గత నెల, ఈ నెల కోటా కింద ప్రతి లబ్ధిదారునికి 15 కిలోల బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఉచిత బియ్యం పంపిణీ ఈనెల 20 వరకు కొనసాగనుంది. ఎలాంటి పరిమితులు లేకుండా కార్డుపై ఎందరుంటే అందరికి 15 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నారు. సాధారణంగా ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున పంపిణీ చేస్తుండగా.. ఈనెలలో 15 కిలోలు ఇస్తున్నారు. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద మే, జూన్ నెలల్లో ఒక్కొక్కరికి 5 కిలోలు ఉచిత బియ్యం పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత నెల, ఈ నెల కోటా కలిపి 10 కిలోలు, రాష్ట్ర ప్రభుత్వం పక్షాన 5 కిలోల చొప్పున మొత్తం 15 కిలోలు పంపిణీ చేస్తున్నారు. అంత్యోదయ, అన్నపూర్ణ కార్డుదారులకు గతంలో ఇచ్చే కోటాకు అదనంగా మరో 10 కిలోల బియ్యం ఉచితం అందజేస్తారు.
కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభించారు. రాష్ట్రంలోని 17వేల రేషన్ షాపుల ద్వారా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ ఎజెన్సీ కార్డుల పరిధిలోని 53.56 లక్షల కార్డులకు ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. రేషన్ డీలర్లు అంకిత భావంతో పేదలకు రేషన్ అందించాలని కోరారు. రేషన్ బియ్యం పంపిణీలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పకడ్బందీ చర్యలు తీసుకొన్నామన్నారు, ఈ కష్టకాలంలో పేదల కడుపునింపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మంత్రి గంగుల కమలాకర్.
Also Read: విషమ పరిస్థితుల్లో డాక్టర్.. వెంటనే స్పందించి రూ. కోటి విడుదల చేసిన సీఎం జగన్