CM KCR – Foxconn: వచ్చేస్తున్నాం కేసీఆర్ సార్.. తెలంగాణలో ఎంట్రీ ఇస్తున్నామంటూ ఫాక్స్‌కాన్ ఛైర్మన్ లేఖ..

తెలంగాణ ప్రభుత్వంతో ఇటీవల భారీ ఒప్పందం కుదుర్చుకున్న ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ ఛైర్మన్ యంగ్ ల్యూ.. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుకు ప్రత్యేక లేఖ రాశారు.

CM KCR - Foxconn: వచ్చేస్తున్నాం కేసీఆర్ సార్.. తెలంగాణలో ఎంట్రీ ఇస్తున్నామంటూ ఫాక్స్‌కాన్ ఛైర్మన్ లేఖ..
Cm Kcr
Follow us

|

Updated on: Mar 06, 2023 | 12:49 PM

తెలంగాణ ప్రభుత్వంతో ఇటీవల భారీ ఒప్పందం కుదుర్చుకున్న ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ ఛైర్మన్ యంగ్ ల్యూ.. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుకు ప్రత్యేక లేఖ రాశారు. తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ స్పెషల్‌గా అందించిన గ్రీటింగ్స్‌కి కృతజ్ఞతలు చెబుతూనే.. తమ టీమ్‌కి తెలంగాణ ప్రభుత్వం అందించిన సహకారానికి, ఆతిధ్యానికి ముగ్దుడైనయ్యానంటూ సీఎం కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పుడు తనకు హైదరాబాద్‌లో ఓ మంచి స్నేహితుడు ఉన్నారని, భవిష్యత్తులో మరింతగా కలిసి పనిచేస్తామని కూడా లేఖలో చెప్పుకొచ్చారు.

మార్చి 2న జరిగిన సమావేశంలో తమ టీం హామీ ఇచ్చినట్టుగానే కొంగరకొలాన్‌ పార్క్‌లో వీలైనంత తొందరగా మానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేసి తీరుతామని అందుకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్న విశ్వాసం తమకు ఉందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ప్రత్యేకంగా కేసీఆర్‌‌ను ఆహ్వానించిన యంగ్ ల్యూ తైపెయిలో కేసీఆర్‌కు ఆతిథ్యం ఇవ్వడం తనకు లభించే గౌరవంగా భావిస్తున్నట్టు లేఖ ద్వారా తెలియజేశారు.

ఇవి కూడా చదవండి

కాగా.. తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్‌ తయారీ సంస్థ ఫాక్స్‌కాన్‌ భారత్‌లో తయారీ పరిశ్రమ ఏర్పాటుపై నిన్న కీలక ప్రకటన చేసింది. తమ కంపెనీ ఛైర్మన్‌ భారత్‌లో పర్యటించినప్పటికీ.. ఎలాంటి ఒప్పందాలూ ఇంకా చేసుకోలేదంటూ వెల్లడించింది. కాగా.. హోన్‌ హాయ్‌ టెక్నాలజీ గ్రూప్‌నకు చెందిన ఫాక్స్‌కాన్‌ ఛైర్మన్‌ యంగ్‌ లియూ నేతృత్వంలోని బృందం భారత్‌లో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 4 వరకు పర్యటించింది. అయితే, ఈ పర్యటనలో భాగంగా ఐఫోన్లు తయారు చేసే ఫాక్స్‌కాన్‌ సంస్థ తెలంగాణలో కూడా పర్యటించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..