TS SET-2022: టీఎస్ సెట్-2022 పరీక్ష వాయిదా.. కొత్త తేదీలు త్వరలో ప్రకటన
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో టీఎస్ సెట్-2022 పరీక్షను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు..
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో టీఎస్ సెట్-2022 పరీక్షను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మార్చి 13న నిర్వహించాల్సిన పరీక్షను మాత్రమే వాయిదా వేస్తున్నట్లు, 14, 15 తేదీలలో నిర్వహించే పరీక్షలు షెడ్యూల్ ప్రకారం యథావిథిగా నిర్వహిస్తామని వివరించారు. టీఎస్ సెట్-2022కు సంబంధించిన హాల్‌టికెట్లు మార్చి 10 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని ఈ సందర్భంగా సూచించారు. వాయిదా పడిన పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.
కాగా తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్-2022 నిర్వహణకు ఉస్మానియా యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. మార్చి 13, 14, 15 తేదీల్లో మొత్తం 29 సబ్జెక్టుల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు తొలుత ప్రకటించారు. ఐతే తాజాగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా 13వ తేదీ నిర్వహించవల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఓయూ తాజాగా ప్రకటించింది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.