KVS Hyderabad: శివరాంపల్లిలోని కేంద్రీయ విద్యాలయలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నో ఎగ్జాం..ఇంటర్వ్యూ తేదీ ఇదే..
కేంద్ర ప్రభుత్వ పరిధికి చెందిన తెలంగాణ రాష్ట్రం హైదారాబాద్ శివరాంపల్లిలోని కేంద్రీయ విద్యాలయంలో.. పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ, వొకేషనల్ కోచ్, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్ తదితర పోస్టుల భర్తీకి..
కేంద్ర ప్రభుత్వ పరిధికి చెందిన తెలంగాణ రాష్ట్రం హైదారాబాద్ శివరాంపల్లిలోని కేంద్రీయ విద్యాలయంలో.. పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ, వొకేషనల్ కోచ్, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ కేంద్రీయ విద్యాలయ సంగతన్ ప్రకటనను జారీ చేసింది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్, కామర్స్ తదితర సబ్జెక్టుల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఆయా పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈడీ/బ్యాచిలర్స్ డిగ్రీ/డిప్లొమా/బీఈ/బీఎస్సీ/డీఈడీ/ఇంటిగ్రేటెడ్ డిగ్రీ/ పీజీ డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 65 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఆసక్తి కలిగిన మార్చి 10, 2023వ తేదీన ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిముషాల వరకు కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.21,250ల నుంచి రూ.27,500ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
అడ్రస్..
THE KENDRIYA VIDYALAYANO SVP NPA, HYDERABAD – 500052.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.