SSC Recruitment: స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో భారీగా ఉద్యోగాలు.. ఎవరు అర్హులు.? ఎలా ఎంపిక చేస్తారంటే.?
స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. భారత ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ మంత్రిత్వశాఖకు చెందిన ఎస్‌ఎస్‌సీలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు...
స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. భారత ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ మంత్రిత్వశాఖకు చెందిన ఎస్‌ఎస్‌సీలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా ఎంపిక చేస్తారు.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 5369 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-II, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, హిందీ టైపిస్ట్, సౌండ్ టెక్నీషియన్, అకౌంటెంట్, ప్లానింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్స్‌టైల్ డిజైనర్, రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్, రీసెర్చ్ అసిస్టెంట్, లాబొరేటరీ అసిస్టెంట్, జూనియర్ కంప్యూటర్, లైబ్రరీ-కమ్-ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్, జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, డ్రాఫ్ట్స్ మాన్, ప్రాసెసింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేటర్, నావిగేషనల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను అనుసరించి మెట్రిక్యులేషన్, హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను స్కిల్ టెస్ట్/ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్/ డేటాఎంట్రీ టెస్ట్/ కంప్యూటర్ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 06-03-2023న మొదలై 27-03-2023తో ముగుస్తుంది.
* కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌ను జూన్-జూలైలో నిర్వహిస్తారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..